ఓవర్సీస్ లో 50 కోట్ల లెక్క.. టాప్ లిస్టులో హనుమాన్
ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది.
ఈ ఏడాది సంక్రాంతికి చిన్న సినిమాగా బరిలో దిగి, పెద్ద విజయం సాధించిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా లేదు.
అమెరికాలో ఎవరూ ఊహించని రేంజ్ లో వసూళ్లను కొల్లగొడుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల రికార్డులను సైతం బ్రేక్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. హనుమాన్ సినిమా తెలుగు తమిళ హిందీ కన్నడ భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది.
ఓవర్సీస్ లో రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాలో చేరింది. ఇప్పటికే ఈ లిస్ట్ లో హనుమాన్ కన్నా ముందు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన నాలుగు చిత్రాలతోపాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఉన్నాయి. ఈ ఐదూ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రాలే. వీటి సరసన హనుమాన్ స్థానం సంపాదించుకోవడం గ్రేటే. రిలీజ్ వైజ్ గా ఓవర్సీస్ లో రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాలివే.
బాహుబలి (2015)
బాహుబలి-2 (2017)
సాహో (2019)
ఆర్ఆర్ఆర్ (2022)
సలార్ (2023)
హనుమాన్ (2024)
ప్రశాంత్ వర్మ యూనివర్స్ లోని ఫస్ట్ మూవీ అయిన హనుమాన్ లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించగా.. వర్షం ఫేమ్ వినయ్ రాయ్ విలన్ గా నటించారు. సముద్రఖని, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
హనుమాన్ మూవీ.. తెలుగు చిత్రసీమలో ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలుస్తుందని సినీ పండితులు చెబుతున్నారు. మరిన్ని రికార్డులు సృష్టించడం పక్కా అని అంటున్నారు. అతి తక్కువ బడ్జెట్ తో ఈ అద్భుతాన్ని సృష్టించి తన మార్క్ చూపించారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మరి జై హనుమాన్ విడుదలయ్యాక ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.