హనుమాన్ సినిమా పెద్దది.. హీరో చిన్నోడు.. తేజ కౌంటర్

ఈ సమయంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తేజ సజ్జ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2023-12-19 09:58 GMT

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ - డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. మైథలాజికల్ కాన్సెప్ట్తో పూర్తి భిన్నంగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ తెగ ఆకట్టుకుంటోంది. విజువల్స్ హైక్వాలిటీతో అద్భుతంగా ఉన్నాయి. అయితే చిత్ర యూనిట్.. తాజాగా మీడియా మిత్రులతో ఇంట్రాక్షన్ నిర్వహించింది. ఈ సమయంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తేజ సజ్జ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇంట్రాక్షన్ లో భాగంగా.. హనుమాన్ సినిమా స్కేల్ చాలా పెద్దదని, కానీ హీరో మాత్రం సినిమా కన్నా చిన్నగా కనిపిస్తున్నారని ఓ ఫిల్మ్ జర్నలిస్ట్ అడిగారు. దీంతో తేజ సజ్జ గట్టి కౌంటర్ ఇచ్చారు. పెద్ద పెద్ద స్టార్ల ఫ్యామిలీకి చెందిన రెండో జనరేషన్ నటులను ఎవరూ ఇలా ప్రశ్నించరని అన్నారు. చిన్నప్పటి నుంచి పరిశ్రమలో ఉన్న తనలాంటి నటులను సరిపోతారా అని అడగడం చిన్న చూపు చూసినట్లే ఉందంటూ కౌంటర్ ఇచ్చారు.

అలా అని తాను ఆ స్టార్ కిడ్స్ తో సమానమని భావించడం లేదని తేజ తెలిపారు. వాళ్లందరికీ వేరే ఛాన్సులు వచ్చినట్లే తనకు హనుమాన్ సినిమా రూపంలో అవకాశం వచ్చిందని వెల్లడించారు. తెలుగు పరిశ్రమలో ఉండాలని కష్టపడి సినిమాలు చేస్తున్నట్లు తేజ తెలిపారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా తాజాగా ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెరిగాయి. ట్రైలర్ లో ఒక పల్లెటూళ్లో ఉండే తేజ సజ్జకు అసమాన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మరో వైపు ఓ విలన్ దేని కోసమో ఇలాంటి శక్తి సామర్థ్యాలు కావాలని ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అతనికి హీరో గురించి తెలిసి ఇక్కడికి వచ్చి దాడి చేస్తాడు. ఆ సమయంలో హీరోని హనుమంతుడు ఎలా కాపాడాడు ఆ తర్వాత ఏం జరిగింది అనే మిగతా సినిమా.

మరోవైపు, ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర పోషిస్తోంది. వాన ఫేమ్ విన‌య్ రాయ్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగా హ‌నుమాన్ మూవీ రాబోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో విడుదల కానుంది.

Tags:    

Similar News