హరీష్ అలెర్ట్ అయ్యాడు..వాళ్లిద్దరు దొరికపోయారు!
సరిగ్గా ఇదే సమయంలో హరీశ్ శంకర్ వినిపించిన కథ కూడా నచ్చడంతో `ఉస్తాద్ భగత్ సింగ్` ని కూడా సెట్స్ కి తీసుకెళ్లారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సెట్స్ పైకి తీసుకెళ్లిన సినిమా దర్శకుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్లెం చేస్తున్నారు? పవన్ ఆడిన గేమ్ లో లాక్ అయింది ఎవరు? అంటే చాలా సంగతులే తెలుస్తు న్నాయి. ముందుగా క్రిష్ దర్శకత్వంలో సోషియా ఫాంటసీ చిత్రం `హరి హరవీరమల్లు`ని పీకే సెట్స్ కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కొద్ది భాగం షూటింగ్ పూర్తయిన తర్వాత దాన్ని పక్కనబెట్టి..యువ దర్శకుడు సుజిత్ తో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో `ఓజీ` చిత్రాన్ని ముంబైలో ప్రారంభించారు.
సరిగ్గా ఇదే సమయంలో హరీశ్ శంకర్ వినిపించిన కథ కూడా నచ్చడంతో `ఉస్తాద్ భగత్ సింగ్` ని కూడా సెట్స్ కి తీసుకెళ్లారు. మరి ఇప్పుడు ఈ మూడు సినిమాల పరిస్థితి ఏంటి? అంటే తెలిసిందే. మూడు సగం సగం షూటింగ్ లు పూర్తి చేసుకుని మధ్యలో ఆగిపోయాయి. పవన్ కళ్యాన్ ఏపీ రాజకీయాల్లో బిజీ అవ్వడం తో సీన్ మారింది. మళ్లీ ఆయన తిరిగి వచ్చినప్పుడే ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్తాడు. అందులో ఓ సినిమా రద్దయిందని కూడా అంటున్నారు. ఆ సంగతేంటో తేలాలి.
క్రిష్ ఇప్పుడు 2024 లో కొత్త సినిమా లాంచ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పవన్ కారణంగా క్రిష్ కి చాలా సమయం వృద్ధా పోయిన మాట వాస్తవం. క్రిష్ కొత్త సినిమా ప్రయత్నాలు ఈ మధ్యనే మొదలు పెట్టాడు. హరీష్ శంకర్ లా ముందే అలెర్ట్ అయి ఉంటే? ఇంత సమయం వృద్ధా గా పోయేది కాదు. ఆయన కూడా వేరే హీరో ని సెట్ చేసుకుని 2024 మిడ్ కల్లా ఓ సినిమా రిలీజ్ చేసుకునే వారు. ఇక హరీష్ శంకర్ రీసెంట్ గా రవితేజ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
`ఉస్తాద్ భగత్ సింగ్ ` ఆయన ఎక్కువగా ఆలోచించకుండా సమయం వృద్ధా చేసుకోకుండా మాస్ రాజాని సెట్ చేసి ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇక యంగ్ మేకర్ సుజిత్ రాకరాక పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ వచ్చిందని `ఓజీ`పై ఎంతో శ్రద్ద పెట్టి పనిచేయడం ప్రారంభించాడు. ఆయన కూడా ఇప్పుడు డైలమాలో పడ్డాడు. `సాహో` ప్లాప్ తర్వాత పీకే తప్ప ఏ హీరో యువ మేకర్ కి ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడా సినిమా మధ్యలో ఆగిపోయింది. ఇప్పటికిప్పుడు మరో స్టార్ హీరో డేట్లు పట్టుకోవడం సాధ్యం అయ్యేది కాదు. అలాగని మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయలేడు. ఇలా ఈ ముగ్గురు దర్శకులు పవన్ బాధితులే.