'హాయ్ నాన్న'.. రొమాంటిక్ లో హెవీ ఏమోషన్
'ప్రాణం అల్లాడి పొద అమ్మాడి' అంటూ సాగిన ఈ ప్రోమోలో నానిని, మృణాల్ టచ్ చేస్తూ స్యాడ్ అండ్ స్మైలింగ్‌తో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా అందంగా అనిపించాయి. చూస్తుంటే జోడీ మధ్య కెమిస్ట్రీ నెక్ట్స్ లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతోంది.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'హాయ్ నాన్న' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. మూవీటీమ్ ప్రమోషన్స్‌లో జోరు పెంచి వరుస అప్డేట్స్ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ బ్యూటిఫుల్ ఎమోషన్స్‌తో సినిమాలో ఉన్న డాటర్ సెంటిమెట్, హీరో హీరోయిన్ లవ్ జర్నీ వంటి ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంది. తాజాగా మూడో సింగిల్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్.
వివరాళ్లోకి వెళితే.. మ్యూజికల్ ప్రమోషన్స్ జర్నీ కూడా ప్రారంభించింది చిత్ర యూనిట్. ఇప్పటికే సమయమా, గాజు బొమ్మ అనే రెండు సాంగ్స్‌ను కూడా విడుదల చేయగా అవి శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ఇక మూడో సింగిల్‌ను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. అమ్మాడి పేరుతో ఈ నెల 4న తేదీన పాట విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ సాంగ్‌కు సంబంధించి ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. 'ప్రాణం అల్లాడి పొద అమ్మాడి' అంటూ సాగిన ఈ ప్రోమోలో నానిని, మృణాల్ టచ్ చేస్తూ స్యాడ్ అండ్ స్మైలింగ్‌తో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా అందంగా అనిపించాయి. చూస్తుంటే జోడీ మధ్య కెమిస్ట్రీ నెక్ట్స్ లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతోంది. సాంగ్ మంచి రొమాంటిక్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.
ఇకపోతే తొలి సాంగ్‌లో నాని - మృణాల్ ఠాకూర్ మధ్య లవ్, బాండింగ్ చాలా బాగా చూపించారు. రెండో సాంగ్‌లో తండ్రి, కూతురు మధ్య ఉండే అందమైన అనుబంధాన్ని హృదయాన్ని హత్తుకునేలా చిత్రీకరించారు. దీంతో ఆ రెండు పాటలకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తండ్రీ, కూతుర్ల మధ్య ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంలో 'హాయ్ నాన్న' చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఇప్పటికే మేకర్స్ చెప్పేశారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ బ్యూటిఫుల్ సాంగ్స్ కంపోజ్ చేశారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు. బేబీ కియారా నాని కుమార్తెగా నటించింది. జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటుండగా.. డిసెంబర్ 7న తెలుగు, హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.