హేమ మరో వీడియో రిలీజ్.. ఈ సారి ఇలా..

ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ అటు తెలుగు రాష్ట్రాలను, ఇటు టాలీవుడ్ ను ఓ రేంజ్ లో కుదిపేస్తోంది

Update: 2024-05-22 10:00 GMT

ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ అటు తెలుగు రాష్ట్రాలను, ఇటు టాలీవుడ్ ను ఓ రేంజ్ లో కుదిపేస్తోంది. రేవ్ పార్టీకి కొందరు తెలుగు నటీనటులు హాజరయ్యారని వార్తలు రావడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే నటుడు శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ తమకు ఆ రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వీడియోల ద్వారా క్లారిటీ ఇచ్చారు. తమకు అలాంటి అలవాట్లు లేవని చెప్పారు.

కానీ నటి హేమ విషయం మాత్రం కన్ఫ్యూజన్ గా మారింది. మొదట హేమ పాల్గొందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హేమ ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు అనే ప్రచారం కూడా జరిగింది . ఇంతలో తాను హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నట్లు వీడియో పోస్ట్ చేసింది హేమ. ఇక నిన్న.. హేమ రేవ్ పార్టీలో ఉందని ఏకంగా బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద ప్రెస్ మీట్ లో వెల్లడించారు అని కూడా ప్రచారం జరిగింది ..ఏది నిజం అనేది మాత్రం తెలియలేదు..

రేవ్ పార్టీలో పాల్గొనలేదని హేమ.. తప్పుదారి పట్టించడం కోసమే వీడియో చేసిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కొత్త వీడియోను పోస్ట్ చేసింది హేమ. ఆ వీడియో ద్వారా కూడా తనకు బెంగళూరు రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పే ప్రయత్నం చేసింది.

హేమ తాను చేసిన ధమ్‌ బిర్యానీకి సంబంధించిన వీడియో పోస్ట్‌ చేసింది. దాన్ని ఎలా వండాలో కూడా వివరంగా చెప్పింది. హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పేందుకే బిర్యానీ తయారు చేస్తున్న వీడియోను హేమ రిలీజ్ చేసినట్టుగా ఈజీగా తెలుస్తోంది. మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీ తర్వాత.. హేమ సోషల్ మీడియా అకౌంట్ పై అందరి దృష్టి పడింది. ఆమె పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి.

అయితే బెంగళూరు రేవ్ పార్టీ కేసు అంతా ఒక ఎత్తు అయితే.. హేమ ఎపిసోడ్ మరో ఎత్తుగా మారింది. నెట్టింట ఎక్కడ చూసినా ఆమె కోసమే మాట్లాడుకుంటున్నారు. హేమ కూడా తనకు రేవ్ పార్టీకి సంబంధం లేదని చెప్పడానికి నానా పాట్లు పడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీ ఆమెకు బాగా తిప్పలు తెచ్చిపెట్టినట్లే. చివరకు హేమ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News