అలనాటి హీరోయిన్ కుమారుడు హీరోగా!
టాలీవుడ్ లో చివరిగా 1997 లో 'సూర్య పుత్రులు' సినిమాలో నటించింది.
అలనాటి అందాల నటి మాలశ్రీ సుపరిచితమే. అప్పట్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. 'ప్రేమఖైదీ' సినిమాతో మాలశ్రీ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. 'సాహసవీరుడు సాగరకన్య', 'భలే మావయ్య' లాంటి చిత్రాల్లోనూ నటించింది. చివరిగా కన్నడ పరిశ్రమలో స్థిరపడింది. టాలీవుడ్ లో చివరిగా 1997 లో 'సూర్య పుత్రులు' సినిమాలో నటించింది.అదే మాలశ్రీ తెలుగు చివరి సినిమా.
ఆ తర్వాత నిర్మాత రాముతో 'ముత్యనంత హెంతి' సినిమా చేసింది. ఆ సినిమా సమయంలో రాముతో ప్రేమలో పడటం..పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే భర్త కరోనాతో మరణించాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇప్పటికే కుమార్తె అనన్య నటిగా కన్నడ పరిశ్రమలో రాణిస్తుంది. కన్నడ స్టార్ దర్శన్ తో 'కాటేరా' సినిమాలో నటించింది. అదే తొలి సినిమా. ఆ సినిమా మంచి విజయం సాధించింది.
ఈనేపథ్యంలో కుమారుడిని కూడా హీరోగా తెరపైకి వెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కుమారుడు ఆర్యన్ వర్కౌట్ చేస్తోన్న ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. కటౌట్ చూస్తుంటే హీరో మెటీరియల్. అచ్చం అమ్మ పోలికలతోనే ఉన్నాడు. హెయిర్ స్టైల్...ఫిజిక్ తో హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. బాక్సింగ్ రింగ్ లో పంచ్ లు ఇసురుతూ ఇలా చిక్కాడు.
బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆర్యన్ విదేశాల్లో చదువుకుంటున్నాడు. నటనపై మక్కువతో ఆరంగంలోనే ట్రైనింగ్ తీసుకుంటున్నాడుట. మంచి హైట్..వెయిట్..హ్యాండ్ సమ్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. ఇవన్నీ చూసిన నెటి జనులు కన్నడ ఇండస్ట్రీకి మరో మంచి హీరో ఖాయమనే పోస్టులు పెడుతున్నారు.