హీరోగా పనికిరానని డిప్రెషన్ లోకి!
హీరోగా ఎంట్రీ ఇచ్చి అటుపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయి ఎన్నో సినిమాలు చేసారు.
సీనియర్ నటుడు నరేష్ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి అటుపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయి ఎన్నో సినిమాలు చేసారు. ఒకప్పుడు హీరోగానూ హాస్యభరతి చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన నటుడాయన. కామెడీలో తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఉందని నిరూపించిన నటుడు. అటుపై ఆయన జర్నీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ అంతే బిజీగా మారింది. ప్రస్తుతం ఆ రకమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.
తాజాగా నరేష్ నట ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన కెరీర్ జర్నీని ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆవేంటోఆయన మాట్లోనే..`పండంటి కాపురం` తో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాను. అది కూడా అమ్మకి తెలియకుండా అప్పటికప్పుడు జరిగిపోయింది. ఇక హీను అవుతానని చెప్పిన ప్పుడు మాత్రం అమ్మ ఒప్పుకోలేదు. ముందుగా చదువు పూర్తిచేయ్ అన్నారు. కానీ నాకు చదువుపై ధ్యాస ఉండేది కాదు.
ఆ సమయంలో అమ్మ అంటే భయం .. సినిమా అంటే ఇష్టం ఉండేది. ఇక హీరోగా తొలి సినిమా సీతా కోకచిలుక నేనే చేయాలి. కానీ కొన్ని కారణాలతో అది కుదరలేదు. ఆ తర్వాత జంధ్యాల గారి చలవ వలన హీరోనయ్యాను. అప్పటి నుంచి హీరోగానే ముందుకు వెళ్లాను. కాస్త డిఫరెంట్ గా చేయాలని అనుకునే వాడిని. అది నాకు కాస్త ప్రతికూల పలితాన్ని అందించింది. ఒకానొక దశలో వరుసగా సినిమాలు చేస్తున్నా..అవి నాకు ఆశించిన ఫలితాలు తీసుకురాలేదు.
వరుస పరాజయాలు చూసి నేను హీరోగా పనికిరానేమో అనే డిప్రెషన్ లో కి వెళ్లిపోయాను` అని అన్నారు. ప్రస్తుతం నరేష్ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ప్రతిష్టాత్మక చిత్రం `గేమ్ ఛేంజర్`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో నరేష్ కీలక పాత్రలో నటించడం విశేషం. మరి ఆ పాత్ర ఎలాంటింది? అన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.