హీరోలంతా అన్ని భాషలు నేర్చుకోవాల్సిందే!
పాన్ ఇండియా పేరుతో రిలీజ్ చేస్తున్నారు తప్ప! అనువాదంతో అక్కడ ఎంతవరకూ కనెక్ట్ అవుతున్నాం అన్నది సీరియస్ గా తీసుకో వడం లేదు.
నేటి తెలుగు సినిమా మార్కెట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ బాక్సాఫీస్ ని తెలుగు సినిమా దున్నేస్తోన్న వైనం చూస్తూనే ఉన్నాం. అన్ని భాషల్లోనూ..అన్నిచోట్ల తెలుగు సినిమా సత్తా చాటుతుంది. బాలీవుడ్ ని మించి టాలీవుడ్ దూసుకుపోతుంది. తెలుగుతో పాటు హిందీ..తమిళం..మలయాళం..కన్నడం..భోజ్ పురి ఇలా అన్ని భాషల్లోనూ తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. మరి అన్ని భాషల్లోనూ మన హీరోలు స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారా? అంటే లేదనే చెప్పాలి. కేవలం తెలుగు వరకూ డబ్బింగ్ చెప్పి మిగతా భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్టులపై ఆధారపడాల్సిన సన్నివేశం కనిపిస్తుంది.
కొంత మంది హీరోలు శ్రద్దతో డబ్బింగ్ ప్రయత్నం చేస్తున్నా..చాలా మంది పట్టించుకోవడం లేదు. పాన్ ఇండియా పేరుతో రిలీజ్ చేస్తున్నారు తప్ప! అనువాదంతో అక్కడ ఎంతవరకూ కనెక్ట్ అవుతున్నాం అన్నది సీరియస్ గా తీసుకో వడం లేదు. కానీ ఈవిషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశ్నంసించాల్సిందే. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న 'దేవర' చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తోన్న నేపథ్యంలో మలయాళంలో నేర్చుకుని నేరుగా ఆయనే దేవరకి డబ్బింగ్ చెబుతున్నారు. గ్లింప్స్ తో ఆవిషయం ప్రూవ్ అయింది.
మలయాళం నేర్చుకోవడం అన్నది అంత ఈజీ కాదు. దేశ భాషల్లో కెల్లా నేర్చుకోవడానికి అత్యంత కష్టమైన భాషగా దాన్ని భావిస్తుంటారు. కానీ తారక్ ఆ భాషని నేర్చుకోవడం విశేషం. ఇక చాలా మంది హీరోలు హిందీతో పాటు తమిళ్..కన్నడ మాట్లాడుతుంటారు. కొంత మంది హీరోలు చెన్నైలో పుట్టి పెరగడంతో తెలుగుతో పాటు తమిళ్ కూడా అప్పటి నుంచే అలవాటైంది. అవసరం మేర డబ్బింగ్ చెప్పగలరు. హిందీ చాలా మంది హీరోలకు తెలిసిందే. అయితే కన్నడ..మలయాళ భాషల్లో మాత్రం మరింత ప్రావీణ్యం అవసరం.
పాన్ ఇండియాలో సినిమా రిలీజ్ అవుతోన్న నేపత్యంలో అన్ని భాషల్లోనూ ఆ హీరోలు సొంతంగా డబ్బింగ్ చెబితేనే ఆ పాత్ర బలంగా పండటానికి అవకాశం ఉంటుంది. మునుముందు టాలీవుడ్ రేంజ్ ఇంకా పెరిగిపోతుంది. బాలీవుడ్ మార్కెట్ నే దాటి పోతుంది. ఇండియన్ సినిమాలో టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం సుస్థిరమవ్వాలంటే? హీరోలు అన్ని భాషలపై పట్టు సాధించాల్సిందే. వాళ్ల పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పాల్సిందే.