విమాన ప్రమాదంలో నటుడు మృతి
హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ మరియు ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరు విమాన ప్రమాదంలో మరణించారు.
హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ మరియు ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరు విమాన ప్రమాదంలో మరణించారు. 51 ఏళ్ల క్రిస్టయన్ ఒలివర్ వెకేషన్ కు వెళ్తూ ఉండగా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడి కరేబియన్ సముద్రంలో కుప్పకూలిందని అధికారులు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం కోస్ట్ గార్డ్ సిబ్బంది పెద్ద ఎత్తున నటుడు క్రిస్టియన్ ఒలివర్ మరియు ఆయన కుటుంబ సభ్యులు ఇంకా పైలెట్ మృతదేహాల కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకు ప్రమాదం కు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించలేక పోయినట్లుగా సమాచారం అందుతోంది.
ఇప్పటి వరకు మూడు మృత దేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. మిగిలిన మృత దేహాలను కూడా అతి త్వరలో కనిపెట్టనున్నారు. అంతే కాకుండా కూలి పోయిన విమాన శకలాలను కూడా గుర్తించేందుకు గాను అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారట.
ది గుడ్ జర్మన్ అనే సినిమా తో క్రిస్టియన్ ఒలివర్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 2008 లో స్పీడ్ రేసర్ తో ప్రపంచ వ్యాప్తంగా నటుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు 60 సినిమాల్లో నటించిన క్రిస్టియన్ ఒలివర్ మృతి పట్ల హాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం ఫరెవర్ హోల్డ్ యువర్ పీస్ అనే సినిమా త్వరలో విడుదల అవ్వాల్సి ఉంది.