యంగ్ టైగర్ ఎన్టీఆర్ 100మందితో వార్!
`ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్..వంద మందిని ఒకేసారి పంపించు..లెక్క తక్కువ కాకుండా చూస్కో`! అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `మగధీర`లో ఓ భారీ డైలాగ్ గుర్తే.;
`ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్..వంద మందిని ఒకేసారి పంపించు..లెక్క తక్కువ కాకుండా చూస్కో`! అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `మగధీర`లో ఓ భారీ డైలాగ్ గుర్తే. ఆ భారీ యాక్షన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో అలాంటి యాక్షన్ సీన్ ఇంత వరకూ ఏ హాలీవుడ్ మేకర్స్ కూడా ట్రై చేయలేదు. తొలిసారి రాజమౌళి `మగధీర`లో భారీ ఫైట్ తో అప్పట్లో సంచలనం అయ్యారు.
తాజాగా `వార్ -2` లో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై అలాంటి భారీ యాక్షన్ సన్నివేశం ఒకటుందని తెలుస్తోంది. సముద్రంలోని ఓడపై తారక్ వంద మందిని మట్టి కరిపించే యాక్షన్ ఫైట్ ఒకటుంది. ఇందులో ఒకేసారి వంద మంది మీద పడితే తారక్ ఎలా ప్రతిఘటించాడు? అన్నది ఆద్యంతం ఆస క్తికరంగా మలిచినట్లు తెలుస్తుంది. తారక్ మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకునే ఆయాన్ ముఖర్జీ ఇంత పెద్ద భారీ ఫైట్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
సముంద్రంలో జరిగే ఈ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందంటున్నారు. ఇందులో తారక్ నెగిటివ్ టచ్ ఉన్న రోల్ పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో అయితే విలన్ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. తారక్ గత చిత్రం `దేవర` పాన్ ఇండియా లో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అందులో భారీ యాక్షన్ సన్నివేశాలెన్నో ఉంటాయి.
తారక్ జాలర్లతో తలపడే సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయి. తెలుగు ప్రేక్షకుల్లో తారక్ మాస్ ఇమేజ్ ఆధారంగా కొరటాల వాటిని డిజైన్ చేసాడు. ఆయాన్ ముఖర్జీ `వార్ -2`లో ఇలాంటి భారీ యాక్షన్ సీక్వెన్స్ కి స్పూర్తి కొరటాల అన్న సందేహం తెరపైకి వస్తోంది. ఇటీవలే `వార్ 2` షూటింగ్ ముగించుకుని తారక్ హైదరాబాద్ కి చేరుకున్న సంగతి తెలిసిందే.