హనుమాన్ చేస్తే హిర్యణ్యకశ్యపకు ప్లస్సే..!

అయితే లేటెస్ట్ గా హనుమాన్ లోని ఆంజనేయుడు స్క్రీన్ షాట్స్ క్లోజప్ చూసి రానానే హనుమంతుడిగా ఫిక్స్ అని సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.

Update: 2024-01-25 01:30 GMT

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన తొలి మూవీ హనుమాన్ సంచలనాలు సృష్టిస్తుంది. అ! నుంచి హనుమాన్ వరకు ప్రతి సినిమాతో ప్రశాంత్ వర్మ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటుతున్నాడు. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాలో హనుమంతుడిగా స్టార్ హీరో నటిస్తాడని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. అయితే లేటెస్ట్ గా హనుమాన్ లోని ఆంజనేయుడు స్క్రీన్ షాట్స్ క్లోజప్ చూసి రానానే హనుమంతుడిగా ఫిక్స్ అని సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.

ప్రశాంత్ వర్మ ప్రతిభ తెలుసు కాబట్టి స్టార్ హీరో ఎవరైనా సరే అతని ప్రపోజల్ కి ఓకే చెప్పకుండా ఉండలేరు. జై హనుమాన్ లో రానానే దాదాపు ఆంజనేయుడిగా కనిపిస్తాడని టాక్. అది నిజమా కాదా అన్నది చిత్ర యూనిట్ చెప్పాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ రానా నిజంగానే ఆంజనేయుడు పాత్ర చేస్తే అది సినిమాకు మరింత ప్లస్ అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు. టాలీవుడ్ హల్క్ గా చెప్పుకునే రానా హనుమంతుడి పాత్రకు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.

అయితే హనుమంతుడిగా రానా చేస్తే ఆ తర్వాత తను చేస్తున్న హిరణ్యకశ్యప సినిమాకు బాగా ప్లస్ అవుతుంది. రానా డ్రీం ప్రాజెక్ట్ గా చెప్పుకునే హిరణ్యకశ్యప మొదట్లో గుణశేఖర్ డైరెక్షన్ లో చేయాలని అనుకున్నారు కానీ ఆయనతో కుదరక లేటెస్ట్ గా త్రివిక్రం తో ఆ సినిమా చేస్తున్నారు. ఆంజనేయుడిగా రానా చేయడం జరిగితే కచ్చితంగా హిరణ్యకశ్యప సినిమాకు అది ప్లస్ అవుతుంది.

తెలుగులో ఎలాంటి పాత్రలకైనా సరే పర్ఫెక్ట్ గా సూటయ్యేలా రానా కనబడుతున్నాడు. బాహుబలి సినిమాలో భళ్లాలదేవ పాత్రలో రానా తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం. హీరో విలన్ కాదు సినిమాలో ఇంపార్టెంట్ రోల్ అది సినిమాకు ప్లస్ అవుతుంది అంటే రానా అక్కడ నిలబడతాడు. రానా జై హనుమాన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి. జై హనుమాన్ గురించి కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 లో సినిమా కచ్చితంగా రిలీజ్ ఉంటుందని ప్రశాంత్ వర్మ చెబుతున్నారు.


Tags:    

Similar News