కుదిరితే చరణ్ లేదంటే చిరు..!

సుకుమార్ మాత్రం తన నెక్స్ట్ సినిమా హీరో ఎవరరన్న కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు.

Update: 2024-01-29 02:30 GMT

పుష్ప 2 పూర్తి చేసే పనిలో డే అండ్ నైట్ కష్టపడుతున్న సుకుమార్. ఆ సినిమా అంచనాలను అందుకునేలా కాదు అంతకు మించి అనిపించేలా తెరకెక్కిస్తున్నాడట. అల్లు అర్జున్ సుకుమార్ ఈ కాంబో మీద ఉన్న ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు నిరాశ పరచలేదు. పుష్ప 1 తో ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో వారి కాంబో స్టామినా చూపించారు. పుష్ప 2తో కూడా మరోసారి వీరు రికార్డుల మీద గురి పెట్టారు. అయితే పుష్ప 2 అనుకున్న విధంగా ఆగష్టు 15న రిలీజ్ అవుతుంది. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ 3 సినిమాల ప్లానింగ్ తో ఉన్నాడు.

సుకుమార్ మాత్రం తన నెక్స్ట్ సినిమా హీరో ఎవరరన్న కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు. స్టార్స్ అంతా కూడా తమ సినిమాలతో దాదాపు రెండేళ్ల దాకా ఖాళీ లేనంతగా బిజీగా ఉన్నారు. అయితే వారిలో రాం చరణ్ ఒక్కడే గేం చేంజర్ ని పూర్తి చేసి బుచ్చి బాబుతో సినిమా ప్రకటించాడు. బుచ్చి బాబు సినిమా అంటే సుకుమార్ సొంత సినిమా అన్నట్టే లెక్క. ఆ సినిమా తో పాటుగా చరణ్ తోనే తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.

ఒకవేళ చరణ్ డేట్స్ కష్టమని అనుకుంటే మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసేలా ప్లాన్ ఉందట. చరణ్ కుదిరితే ఓకే లేదంటే మెగాస్టార్ తో మెగా మూవీ చేయాలని అనుకుంటున్నాడట సుకుమార్. చిరుతో సినిమా అంటే అది మామూలుగా ఉండదు. సుకుమార్ కి ఇష్టమైన హీరో అయిన చిరుతో సినిమా అంటే లెక్కల మాస్టర్ లెక్కలు భారీగానే ఉంటాయి.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయ్యే లోగా సుకుమార్ చిరు కోసం కథ సిద్ధం చేయాలని అనుకుంటున్నారట. సుకుమార్ టాలెంట్ తెలుసు కాబట్టి చిరు కాదనే ప్రసక్తి లేదు. అయితే మెగాస్టార్ తో సినిమా అంటే సుకుమార్ కూడా కాస్త కంగారు పడే ఛాన్స్ ఉంటుంది. పుష్ప 2 తర్వాత చిరు లేదా చరణ్ వీళ్లిద్దరిలోనే ఒకరితో సుకుమార్ సినిమా ఉంటుందని అంటున్నారు. సుకుమార్ కూడా కథ రాసుకోవడం.. మెరుగులు దిద్దడం ఇలా సెట్స్ మీదకు వెళ్లేందుకే చాలా టైం తీసుకుంటాడు. ఆలోగా చిరు, చరణ్ ఎవరు ఫ్రీ అయితే వారితో సినిమా ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News