భర్త దూరంగా ఉంటూ మిస్సవుతుంటే ఇలియానా టిప్
హ్యాపీ మమ్ తరచుగా తన కొడుకు ఫోటోలను అంతర్జాలంలో షేర్ చేస్తోంది. అభిమానులను అప్డేట్ చేస్తుంది.
ఇలియానా డి క్రజ్ కెరీర్ జర్నీ, వ్యక్తిగత జీవితం గురించి పరిచయం అవసరం లేదు. సౌతిండియాలో అగ్రశ్రేణి కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఇలియానా, వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడు తన విదేశీ బోయ్ ఫ్రెండ్(భర్త)తో ఒక బిడ్డను కని, ఆ బిడ్డలోనే ఆనందం వెతుక్కుంటోంది. ఇలియానా తన మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాధిస్తోంది. హ్యాపీ మమ్ తరచుగా తన కొడుకు ఫోటోలను అంతర్జాలంలో షేర్ చేస్తోంది. అభిమానులను అప్డేట్ చేస్తుంది.
ఇటీవల సోషల్ మీడియాలో తన భర్త మైఖేల్ డోలన్‌ను ఎంత ఘోరంగా కోల్పోతోందో షేర్ చేసింది. ఇలియానా పాత వీడియో ఒకదానిని షేర్ చేసింది. సఖుడిని మిస్ అయినప్పుడు తాను ఈ మనోహరమైన వీడియోలన్నింటినీ చూసి సర్ధి చెప్పుకుంటానని వెల్లడించింది. తన భర్త భోజనం చేస్తున్నప్పుడు వీడియోను రికార్డ్ చేస్తూ కనిపించింది ఇల్లీ.
దీనికి అందమైన క్యాప్షన్ ఇచ్చింది. ``అతడు లేట్ నైట్ డ్యూటీలతో ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడైతే, బిజీగా ఉండే వ్యక్తి అయితే.. అతడిని కోల్పోయినప్పుడు, మీరు అతని నుండి పొందిన అన్ని అందమైన వీడియోలను చూడండి`` అంటూ బ్యూటిఫుల్ క్యాప్షన్ ఇచ్చింది. 37 ఏళ్ల ఇలియానా తన భర్తతో వెకేషన్ కి సంబంధించిన మరొక గూఫీ వీడియోను షేర్ చేసింది.
ఇలియానా డి క్రజ్ - మైఖేల్ డోలన్ దంపతుల కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్ ఇటీవల 1వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఒకటో మైలురాయి వేడుకల్ని సెలబ్రేట్ చేసారు. కోవా పుట్టినరోజు వేడుక నుండి అందమైన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసారు. కోవా తన పుట్టినరోజు అలంకరణలతో ఆనందంగా ఉన్న ఫోటోలు, పెద్ద చాక్లెట్ కేక్ ముక్కను తింటూ ఆస్వాధిస్తున్న వీడియో, ఒక చిన్న పేపర్ బ్యాగ్‌ని పట్టుకుని ఉన్నవి హైలైట్ గా కనిపించాయి. కోవా ఫీనిక్స్ తన తల్లిదండ్రులతో సరదాగా గడుపుతూ ఇలియానా ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. చివరి ఫోటో ఫ్యామిలీ స్నాప్‌షాట్.. ఇలియానా- మైఖేల్ -కోవా అందరూ కెమెరాను చూసి ప్రకాశవంతంగా నవ్వుతున్నారు.
ఇలియానా తన ఇన్‌స్టాలో కుమారుడు ఫీనిక్స్ కోవా జీవితంలోని చాలా విశేషాలను రెగ్యులర్‌గా షేర్ చేస్తుంటుంది. అంతకుముందు తన చిన్నారి అవుట్‌డోర్‌లో ఆనందిస్తున్న ఫోటోల సెట్ లను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో కోవా గడ్డితో ఆడుకునే షాట్లు, అద్భుతమైన సముద్రం, బీచ్‌ల దృశ్యాలు, కిటికీ పక్కన కోవా నిలబడి ఉన్న దృశ్యాలు ఉన్నాయి. ఫోటోలతో పాటు ఇలియానా `రోడీ సమ్మర్ డ్రీమ్` అనే క్యాప్షన్‌ను కూడా రాసింది.
మరోవైపు మైఖేల్ డోలన్ తో తన హ్యాపీ లైఫ్ గురించి ఇలియానా వెల్లడించింది. ఇటీవల ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మైఖేల్ డోలన్‌తో తన వివాహాన్ని అధికారికంగా ధృవీకరించింది. వైవాహిక జీవితం చక్కగా సాగుతోంది. నేను అతడిలో ఎక్కువగా ఇష్టపడే దాని గురించి వ్యాఖ్యానించడం కష్టం. నేను ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే నేను సమాధానంతో వచ్చిన ప్రతిసారీ, మరుసటి రోజు మరొకటి టెంప్టింగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది.. అని తెలిపింది. ఇలియానా తదుపరి ఒక ఓటీటీ సిరీస్‌లో విహాన్ సమత్‌తో కలిసి కనిపించనుంది.