రిలీజ్ కాకుండానే రాజాసాబ్‌కి రేటింగ్.. మారుతి స్పంద‌న ఇదీ!

ఇంత‌లోనే పాపుల‌ర్ వెబ్‌సైట్ లో 'ది రాజా సాబ్' క‌థ లీక్ చేసి రేటింగ్ ఇవ్వ‌డం హాస్యాస్పదంగా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

Update: 2024-07-04 11:07 GMT

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం 'క‌ల్కి 2898 AD' ఘ‌న‌ విజయాన్ని ఆస్వాధిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పౌరాణిక వైజ్ఞానిక కల్పన, డిస్టోపియన్ అనంతర భవిష్యత్తు నేపథ్యంలో రూపుదిద్దుకుంది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సుమారు 700 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఇండియా నుంచి 400కోట్లు కొల్ల‌గొట్టింది.

ఇప్పుడు అంద‌రి దృష్టి ప్ర‌భాస్ న‌టిస్తున్న తదుప‌రి చిత్రం 'ది రాజా సాబ్'పై ప‌డింది. ఇంత‌లోనే పాపుల‌ర్ వెబ్‌సైట్ లో 'ది రాజా సాబ్' క‌థ లీక్ చేసి రేటింగ్ ఇవ్వ‌డం హాస్యాస్పదంగా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

జనవరిలో దర్శకుడు మారుతి ప్రభాస్ ప్రధాన పాత్రలో 'ది రాజా సాబ్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. రంగురంగుల లుంగీతో డప్పర్ లుక్‌లో ఉన్న ప్రభాస్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో కూడిన ప్రకటన అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. అయితే విడుదల ప్రణాళిక ఇంకా తెలియలేదు.

ఇటీవల ఒక ప్రముఖ ర్యాంకింగ్ వెబ్‌సైట్ ఈ చిత్రానికి రేటింగ్ ఇచ్చింది. ''ఇది ప్రేమలో పడే జంట గురించిన స్టోరి. కానీ ప్రతికూల శక్తి కారణంగా వారి విధి మారుతుంది! అని క‌థ‌ను కూడా లీక్ చేసేశారు. అయితే దీనిపై దర్శకుడు మారుతి స్పందిస్తూ... IMDb రాసిన క‌థ గురించి ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ ప్లాట్ గురించి తనకు తెలియదని చాలా హాస్యభరితంగా పేర్కొన్నాడు. వేరే స్క్రిప్ట్‌తో మా చిత్రాన్ని చిత్రీకరించమని వెబ్‌సైట్‌ను సరదాగా కోరాడు. మారుతీ స్పందన నెటిజ‌నుల‌ దృష్టిని ఆకర్షించింది. అతడు X లో పోస్ట్ చేస్తూ..'అర‌రే, ఈ ప్లాట్ నాకు తెలియదు! కాబట్టి వేరే స్క్రిప్ట్‌తో షూట్ చేయండి. ఇప్పుడు IMDB వాళ్లు చేస్తారా? మరి IMDB కమ్యూనిటీ అంగీకరిస్తుందా?'' అని రాసారు.

ప్రభాస్, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'ది రాజా సాబ్' హారర్ కామెడీ. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో సినిమా విడుదల కానుంది.

Tags:    

Similar News

eac