యంగ్ టైగర్ జైలర్ ని దించుతున్నాడా?
ఇలా తారక్ అన్ని పాన్ ఇండియా కంటెంట్ పైనే దృష్టి పెట్టి ముందుకెళ్తున్నాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్పీడిప్పుడు మామూలుగా లేదు. ఇటీవలే `దేవర` మొదటి భాగంతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత పాన్ ఇండియాలో మరో సాలిడ్ సక్సెస్ ఇది. వచ్చే ఏడాది `వార్ -2`తో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులొ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. ఈసినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. యుద్ద భూమిలో హృతిక్ తోనే తారక్ పోరాటం అభిమానులు చూడబోతున్నారు.
మరోవైపు ప్రశాంత్ నీల్ తోనూ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. అతి త్వరలోనే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. తారక్ ని ఓ అభిమానిగా డైరెక్ట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. దీంతో తన అభిమాన స్టార్ కి ఏ రేంజ్ స్టోరీ రాసాడు? అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలా తారక్ అన్ని పాన్ ఇండియా కంటెంట్ పైనే దృష్టి పెట్టి ముందుకెళ్తున్నాడు. ఈనేపథ్యంలో తాజాగా `జైలర్` తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ ని రంగంలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే ఇద్దరి మద్య స్టోరీ డిస్కషన్ జరిగిందిట. తారక్ కి కూడా నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చెప్పినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మాత్రం సమయం పడుతుంది. 'వార్-2' తర్వాత ప్రశాంత్ నీల్ షూటింగ్ కి హాజరవుతాడు తారక్. అటుపై కొరటాల శివ దర్శకత్వంలో దేవర-2 మొదలవుతుంది. అనంతరం నెల్సన్ సినిమాకి డేట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఆర్డర్ ఛేంజ్ అయితే గనుక కొరటాల ప్లేస్ లోకి నెల్సన్ వచ్చే అవకాశం ఉంది.
'దేవర-2' విషయంలో సమయం తీసుకోవాలనుకుంటున్నారు. అయితే వచ్చే ఏడాది ఆ ప్రాజెక్ట్ మొదలవుతుందని ప్రకటించారు. కానీ కొన్ని సందర్భాల్లో హీరోల ప్లానింగ్స్ మారుతుంటాయి. అలా మార్పు ఏదైనా చోటు చేసుకుంటే ముందు అనుకున్న ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ల అవకాశం ఉంది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ `జైలర్ -2` పనుల్లో బిజీగా ఉన్నాడు. రజనీకాంత్ హీరోగా వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది.