GOG - ఆ విషయంలో ఎలాంటి నష్టం కలిగించలేదు

విడుదలకు ముందు వరుస అప్డేట్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు అందించగలిగింది.

Update: 2024-06-10 10:45 GMT

విశ్వక్ సేన్ నటించిన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" గత నెల చివరన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకుంది. టాలెంటెడ్ దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కించగా, సీతార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. విడుదలకు ముందు వరుస అప్డేట్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు అందించగలిగింది.

క్రిటిక్స్ నుంచి కొంతమంది మిక్స్‌డ్ టాక్ అందుకున్నప్పటికీ, విశ్వక్ సేన్ తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యాడు. ఊర మాస్ పాత్రలో విశ్వక్ తొలిసారి కనిపించడం, ఆయన ఎంటర్టైన్మెంట్ కిక్ అందించడం సినీ ప్రేమికులను మెప్పించింది. ఇక ఇటీవల హఠాత్తుగా సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇలాంటి మంచి బజ్ క్రియేట్ సినిమాను అంత త్వరగా ఓటీటీ లోకి తీసుకు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితంపై వివిధ రకాల కథనాలు కూడా వస్తున్నాయి. నిజానికి సినిమా అయితే కమర్షియల్ గా నష్టాలను ఏమాత్రం కలిగించలేదు. విశ్వక్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది ఈ సినిమా.

అన్ని ఏరియాలలోనూ మంచి కలెక్షన్స్ సాధించడంతో, డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలను దాటుకొని లాభాల్లోకి రావడంలో సక్సెస్ అయ్యారు. విశ్వక్ సేన్ స్టార్ ఇమేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఈ సినిమాతో మరోసారి స్పష్టమైంది. ఎలక్షన్స్ రిజల్ట్ ప్రభావం ఉన్నప్పటికీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి కలెక్షన్స్ రాబట్టగలిగింది. ఓటీటీ డీల్ ద్వారా కూడా నిర్మాత సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. నాన్ థియేట్రికల్ గా సినిమా మంచి బిజినెస్ చేసింది.

Read more!

సినిమాకు వచ్చిన రిజల్ట్ కంటే ఇంకా ఎక్కువ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుందని అనుకున్నారు. కానీ GOG ఓ వర్గం ఆడియెన్స్ ను క్రిటిక్స్ ని పూర్తి స్థాయిలో ఎట్రాక్ట్ చేయలేకపోయింది. అయినప్పటికీ విశ్వక్ స్టార్ ఇమేజ్ అతని పెర్ఫెమెన్స్ సినిమాకు చాలా హెల్ప్ చేశాయి. ఒక కొత్త తరహా మాస్ అవతార్ ని అతను చూపించడంతో విజిల్స్ కూడా పడ్డాయి.

డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. ఇక ఓటీటీ డీల్ ద్వారా కూడా సినిమాకు బెన్ఫిట్ అయ్యేలా ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. మొత్తానికి విశ్వక్ సేన్ నటన, కృష్ణ చైతన్య దర్శకత్వం మంచి ప్రశంసలు అందుకున్నాయి. "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమా మాస్ ఆడియన్స్ కు కావలసిన ఎంటర్టైన్మెంట్ అందించడంతో పాటు, సినిమా అభిమానులను ఆకట్టుకుంది.

Tags:    

Similar News

eac