దేవరకొండ పాన్ ఇండియా డైరెక్టర్ అతడేనా?
దీంతో ఇప్పుడీ సినిమాకి దర్శకత్వం వహించేది ఎవరు? అని ఆరాతీయగా ఆసక్తికరంగా ఓ దర్శకుడు పేరు తెరపైకి వచ్చింది. అతడే శ్రీకాంత్ ఓదేల.
విజయ్ దేవరకొండ తో నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామ్యంలో రాజుగారు- విజయ్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మైత్రి లేకుండా రాజుగారు సోలోగా బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడీ సినిమాకి దర్శకత్వం వహించేది ఎవరు? అని ఆరాతీయగా ఆసక్తికరంగా ఓ దర్శకుడు పేరు తెరపైకి వచ్చింది. అతడే శ్రీకాంత్ ఓదేల. కొంత కాలంగా శ్రీకాంత్ ఓదెల తో రాజుగారు ట్రావెల్ అవుతున్నారుట.
ఈ క్రమంలో ఓ స్టోరీ వినిపించగా అది పాన్ ఇండియాకి కనెక్ట్ అవుతుందని భావించి లాక్ చేసినట్లు సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. ఏడాది కాలంగానే ఇద్దరి మధ్య డిస్కషన్స్ నడుస్తున్నట్లు తెలిసింది. పైనల్ గా ఇప్పుడా జర్నీ ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. శ్రీకాంత్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తొలి సినిమా 'దసరా ' తోనే మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. నాని హీరోగా నటించిన ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. తొలి సినిమాతనే 100 కోట్ల వసూళ్లు రాబట్టాడు.
'దసరా' తొలి సినిమా అయినా ఓ పది సినిమాల అనుభవం గల మేకర్ గా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా పంపిణీ చేసింది కూడా దిల్ రాజు సంస్థనే. సంస్థకు మంచి లాభాలొచ్చాయి. దీంతో ఆనాడే శ్రీకాంత్ ని టార్టెగ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'గేమ్ ఛేంజర్' ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది రాజు గారే అన్న సంగతి తెలిసిందే.
శంకర్ తో ఎప్పటి నుంచో సినిమా తీయాలి అన్న కోరికను ఈ సినిమాతో తీర్చుకుంటున్నారు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా రూపొందుతుంది. ఇప్పుడిదే వేడిలో విజయ్ తో పాన్ ఇండియా సినిమా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇది విజయ్ కి రెండవ పాన్ ఇండియా చిత్రం. తొలిసారి పూరి తో కలిసి 'లైగర్' చేసాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించని సంగతి తెలిసిందే.