సంక్రాంతి పోటీ.. అసలు సౌండే లేదేంటయ్యా
గుంటూరు కారం లాంటి పెద్ద సినిమా ఉన్నప్పటికీ వేరే ఏ సినిమాలు కూడా కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదు
2024 సంక్రాంతి మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో గతంలో ఎప్పుడూ లేనంత క్రేజీ సినిమాలు ఈ ఫెస్టివల్ను టార్గెట్ చేశాయి. అసలు థియేటర్లో సరైన పద్ధతిలో దొరుకుతాయా లేవా అనే విషయంలో కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. నిర్మాతలు అయితే సంక్రాంతి అని చాలా మొండిపట్టు తో వెళుతున్నారు అనే కామెంట్స్ అయితే వస్తున్నాయి. గుంటూరు కారం లాంటి పెద్ద సినిమా ఉన్నప్పటికీ వేరే ఏ సినిమాలు కూడా కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదు.
జనవరి 12 నుంచి 15 మధ్యలోనే కీలకమైన డేట్స్ కోసం ఐదు సినిమాలు పోటీల్లో నిలబడుతున్నాయి. రవితేజ ఈగల్ సినిమా తో పాటు నాగార్జున నా సామి రంగా, తేజ సజ్జా హనుమాన్ అలాగే వెంకటేష్ సైంధవ్ కూడా సంక్రాంతికి రాబోతున్నాయి. ఈ సినిమాలు కంటెంట్ పరంగా అయితే వేటికవే భిన్నంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఒక సినిమాతో మరొక సినిమా పోటీ అని చెప్పడానికి కాస్త కష్టంగానే ఉంటుంది.
గతంలో వచ్చిన సంక్రాంతి సినిమాలలో మూడు సినిమాలకు కూడా మంచి కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇపుడు ఒకేసారి ఐదు సినిమాలు అంటే తప్పకుండా మరో రెండు సినిమాలు తీవ్రమైన నష్టాలు ఎదుర్కొక తప్పదు. కానీ మా కంటెంట్ తప్పకుండా క్లిక్ అవుతుంది అని ఎవరికి వారు చాలా ధీమాగా కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ అందరూ మర్చిపోతున్న మరొక విషయం ఏమిటి అంటే ముందుగా సినిమా సాంగ్స్ ద్వారానే కావాల్సినంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇక సంక్రాంతికి రాబోతున్న సినిమాలకు సంబంధించిన సాంగ్స్ కొన్ని ఇటీవల విడుదల అయ్యాయి. అందులో హనుమాన్ సినిమా నుంచి రెండు పాటలు వచ్చాయి అలాగే గుంటూరు కారం నుంచి ధమ్ మసాలా అనే పాట వచ్చింది. ఇక ఈగల్, సైంధవ్, నా సామి రంగా సినిమాలనుంచి ఒక్కో పాట విడుదలయ్యింది. అయితే ఇందులో ఏవి కూడా అనుకున్నంత స్థాయిలో సౌండ్ క్రియేట్ చేయడం లేదు.
ఏ సాంగ్ కూడా చర్ట్ బస్టర్ అనిపించేలా అయితే యూట్యూబ్లో కూడా కనిపించడం లేదు. క్రేజీ సినిమాలే కానీ కంటెంట్ కంటే ముందు సాంగ్స్ తో కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అసలే పోటీలో ఉన్నారు కాబట్టి సినిమాలకు ఓపెనింగ్స్ గట్టిగా ఉండాలి అంటే ముందుగా సాంగ్స్ ద్వారా కూడా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయాలి. కానీ ఆ విషయంలో సంక్రాంతి సినిమాలు అంచనాలను అందుకోలేకపోతున్నాయి. మరి రాబోయే అప్డేట్స్ ద్వారా మరికొన్ని సాంగ్స్ ద్వారా అయినా మంచి హైప్ క్రియేట్ చేస్తారో లేదో చూడాలి.