'జాబిలమ్మ నీకు అంత కోపమా' ట్రైలర్.. మేనల్లుడితో ధనుష్ లవ్ గేమ్
తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సినిమా విడుదల కాబోతోంది. ఇక ఇటీవల విడుదలైన తెలుగు ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
సౌత్ ఇండస్ట్రీలో హీరో ధనుష్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. నటనలో కూడా ఓ ప్రత్యేకమైన స్టైల్ ను ఏర్పరుచుకున్న ధనుష్, దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. ఇప్పుడు మూడోసారి దర్శకుడిగా వ్యవహరిస్తూ తన క్రియేటివ్ టాలెంట్‌ను మరోసారి చాటేందుకు సిద్ధమయ్యాడు. "జాబిలమ్మ నీకు అంత కోపమా" పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సినిమా విడుదల కాబోతోంది. ఇక ఇటీవల విడుదలైన తెలుగు ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందులో హీరో చెప్పిన "జాలీగా రండి.. జాలీగా వెళ్లండి" అనే డైలాగ్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే, ఇందులో ధనుష్ తన అక్క కొడుకు పవిష్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. పవిష్ సరసన అనికా సురేంద్రన్ నటించగా, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, సతీష్, వెంకటేష్, రమ్య రంగనాథన్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అంతేకాకుండా, ప్రియాంక మోహన్ "గోల్డెన్ స్పారో" పాటలో గెస్ట్ రోల్ చేయడం కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. యూత్‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ తీసిన ఈ చిత్రంలో సరికొత్త లవ్ గేమ్ ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రేమ, భావోద్వేగాలతో పాటు కామెడీ సమపాళ్లలో మేళవిస్తూ తెరకెక్కినట్లు కనిపిస్తోంది. నార్మల్ స్టోరీ లైన్ లోనే కొత్త తరహా ఎలిమెంట్స్ ను హైలెట్ చేసినట్లు తెలుస్తోంది. లవ్ కి, లవ్ ఫెయిల్యూర్ కి మధ్యలో ఉండే ఎమోషన్స్ తో అబ్బాయి ప్రేమకథగా ఉండనున్నట్లు అర్ధమవుతుంది.
అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లిలో అబ్బాయి ఎదుర్కొనే అనుభవాలను డిఫరెంట్ గా చూపించనున్నట్లు అర్ధమవుతుంది. నిర్మాణ సంస్థ వుండర్ బార్, RK ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రూపొందిన ఈ సినిమా ఇప్పటికే తమిళ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరచుకుంది. ధనుష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రతి అప్డేట్‌కి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లవ్ స్టోరీలకు కొత్తదనం ఇస్తూ, వినోదాత్మకంగా తెరకెక్కించే ధనుష్ స్టైల్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. విడుదలైన ట్రైలర్‌కి అనూహ్య స్పందన వస్తుండటంతో, ఈ సినిమా ధనుష్‌కు దర్శకుడిగా మరొక విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో యూనిట్ ఉంది. గతంలో "పా పాండి"తో కుటుంబ ప్రేక్షకుల మనసు దోచుకున్న ధనుష్, ఇప్పుడు "జాబిలమ్మ నీకు అంత కోపమా"తో యూత్‌ను టార్గెట్ చేశాడు. సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా సినిమాకి హైలైట్ అవుతాయని సమాచారం.