స్కూలింగ్ అనంత‌ర‌మే న్యూయార్క్ చెక్కేసిన తంగ‌!

రెండ‌వ భాగంలో జాన్వీ పాత్ర మెరుగ్గా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

Update: 2024-12-30 10:30 GMT

అతిలోక సుంద‌రి శ్రీదేవి వార‌సురాలిగా జాన్వీ క‌పూర్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ కి 'ధ‌డ‌క్' తో ..టాలీవుడ్ కి 'దేవ‌ర‌'తోనూ లాంచ్ అయింది. రెండు సినిమాల‌తోనూ అమ్మ‌డు అద‌ర‌గొట్టింది. 'దేవ‌ర'లోని తంగ‌ పాత్ర విష‌యం లో కొన్ని విమ‌ర్శ‌లొచ్చినా? అందుకు స‌మాధానం 'దేవ‌ర‌-2'లో దొరుకుతుంది. రెండ‌వ భాగంలో జాన్వీ పాత్ర మెరుగ్గా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం అమ్మ‌డు ఆర్సీ 16లోనూ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇంకా అమ్మ‌డికి టాలీవుడ్ లో మంచి భ‌విష్య‌త్ క‌నిపిస్తుంది.


ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే? జాన్వీకి న‌ట‌నంటే ఎంత ఆస‌క్తి అన్న‌ది ఆల‌స్యంగా బ‌య‌ట ప‌డింది. ముంబైలో స్కూలింగ్ పూర్త‌యిన అనంత‌రం జాన్వీ ని న్యూయార్క్ లోని థియేట‌ర్ ఆర్స్ట్ లో ట్రైనింగ్ మొద‌లు పెట్టిన‌ట్లు రివీల్ చేసింది. చిన్న నాటి నుంచి సినిమా వాతావ‌ర‌ణంలో ఉండ‌టంతో? న‌ట‌న పై ఆ వ‌య‌సులోనే మ‌క్కువ ఏర్ప‌టిందని తెలిపింది. అమ్మ పెద్ద న‌టి కావ‌డం...నాన్న అగ్ర నిర్మాత కావ‌డంతో? నిరంత‌రం డైనింగ్ టేబుల్ వ‌ద్ద సినిమాకి సింబంధిం చిన విష‌యాలే ఎక్కువ‌గా చ‌ర్చ‌కు వ‌చ్చేవి అని తెలిపింది.

అలా సినిమా అంటే పూర్తిగా తెలియ‌ని వ‌య‌సులోనే క‌ళ‌పై ఆస‌క్తి మొద‌లైందంది. తాను సినిమాల్లోకి రావ‌డం వెనుక త‌ల్లి ప్రోత్సాహం ఎంతో ఉంద‌ని, అలాగ‌ని సినిమాలు మాత్ర‌మే చేయాల‌ని ఏనాడు త‌ల్లిదండ్రులు ఒత్తిడి తీసుకు రాలేద‌ని, న‌చ్చిన రంగాలు ఎంచుకునే ఆప్ష‌న్ ఇచ్చిన త‌ర్వాతే సినిమా అనేది ఓ ఆప్ష‌న్ గా సూచించిన‌ట్లు తెలిపింది. అయితే న‌టిగా ప్రారంభ‌మైన త‌ర్వాత స్టార్ కిడ్ అయినా? ప్ర‌యాణం సాగించ‌డం అంత సుల‌భం కాద‌ని అభిప్రాయ ప‌డింది.

ఈ రంగంలో ట్యాలెంట్ తో పాటు ఎంతో స‌హ‌నం కూడా అవ‌స‌ర‌మందని తెలిపింది. ఇక శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ క‌పూర్ కూడా తెరంగేట్రానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. `ది అర్చీస్` తో ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క రించింది. ప్ర‌స్తుతం పూర్తి స్థాయి హీరోయిన్ గా మారే ప‌నిలో ఉంది.

Tags:    

Similar News