జాన్వీకి అత‌డితో ఏమాత్రం సెట్ అవ్వ‌లేదా?

జాన్వీతో క‌ల‌వ‌డం విష‌యంలో నాకెలాంటి వైబ్ రాలేద‌ని గుల్ష‌న్ అంటున్నాడు.

Update: 2024-07-22 04:00 GMT

ఒకే సినిమాలో క‌లిసి న‌టిస్తే ఆ సినిమా పూర్త‌య్యేలోపు స్నేహితులు అవ్వ‌డం..ఇంకా బాండింగ్ బ‌ల‌ప‌డితే ల‌వ్ లో ప‌డిపోవ‌డం జ‌రుగుతుంటుంది. ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరో-హీరోయిన్ల ల‌వ్ స్టోరీలోకి వెళ్తే ఇదే మ్యాట‌ర్ బ‌య‌ట ప‌డుతుంది. ఒక‌వేళ ల‌వ్ లో ప‌డ‌క‌పోయినా మంచి స్నేహితులు అయితే అవుతారు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ కాంబినేష‌న ని చూస్తే వాళ్లు క‌నీసం స్నేహితులు కూడా కాలేక‌పోయారు? అన్న సంగ‌తి వెలుగులోకి వ‌చ్చింది.

వివ‌రాల్లోకి వెళ్తే జాన్వీక‌పూర్- గుల్ష‌న్ దేవ‌య్య జంట‌గా 'ఉల‌జ్' అనే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ట్రైల‌ర్ కూడా రిలీజ్ అయింది. ఇద్ద‌రి మ‌ధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగుంది. కానీ ఆఫ్ ది స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం ఏమాత్రం సెట్ కాలేదుట‌. జాన్వీతో క‌ల‌వ‌డం విష‌యంలో నాకెలాంటి వైబ్ రాలేద‌ని గుల్ష‌న్ అంటున్నాడు. 'ఆమె డైరెక్ట‌ర్ చెబితే నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. న‌టిస్తుంది. తానో ప్రోపెష‌న‌ల్ యాక్ట‌ర్స్.

కాబ‌ట్టి అలాగే మ‌సులుకుంటుంది. షూటింగ్ గ్యాప్ వ‌చ్చిన‌ప్పుడు కూడా పెద్ద‌గా మాట్లాడుకోలేదు. క‌నీసం స్నేహితులు కూడా కాలేక‌పోయాం' అన్నాడు. వీటిపై జాన్వీ స్పందించింది. 'నిజంగానే మేం క‌లిసి కూర్చుని క‌బుర్లు చెప్పుకోలేదు. ఒక‌సారైతే కొంద‌రు కాపీకి అలా వెళ్లిరండి అన్నారు. ఇద్ద‌రు ప‌క్క ప‌క్క‌నే ఎవ‌రో తెలియ‌న‌ట్లు కూర్చున్నారేంటి? స‌ర‌ద‌గా జోకులేసుకుండని, న‌వ్వుకోండని నాకు స‌ల‌హాలిచ్చారు.

అలాగైతే అత‌డు వేసే జోకుల‌కు మీరు న‌వ్వండి లేదంటే? లేదంటే త‌ను ఫీల‌వుతాడ‌న్నాను' అని స్పం దించింది. అలా జాన్వీ-గుల్ష‌న్ 'ఉల‌జ్' సినిమాకి పనిచేస్తున్నారు. జాన్వీ ఎంతో జోవియ‌ల్ ప‌ర్స‌న్ అనే టాక్ ఉంది. ఎవ‌రితోనైనా ఇట్టే క‌లిసి పోతుంది. కానీ గుల్ష‌న్ మాత్రం రిజర్డ్వ్ . అందుకే ఇద్ద‌రి మ‌ధ్య ఏమాత్రం సింక్ అవ్వ‌లేద‌ని బాలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి.

Tags:    

Similar News