అటువంటి పాత్రలకే రెడీ అంటున్న దేవర బ్యూటీ..

తాజాగా ఆమె నటించిన 'ఉలఝ'మూవీ ఆగస్టు రెండున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ తనకు నచ్చిన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Update: 2024-07-31 05:38 GMT

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ సినిమా విడుదలకు ముందే మెగా పవర్ స్టార్ పక్కన మరొక సినిమాకి చాన్స్ కొట్టేసింది. తాజాగా ఆమె నటించిన 'ఉలఝ'మూవీ ఆగస్టు రెండున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ తనకు నచ్చిన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

తన జీవితంలో సవాలతో కూడిన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తానని ఈ బ్యూటీ కుండ బద్దలు కొట్టి చెప్పేసింది.. అంతేకాదు ఆమె జీవితమంతా నటనకే అంకితం అంటూ తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ అంచలంచలుగా ముందుకు వెళ్తున్నాను అని స్పష్టం చేసింది. అందరిలాగా గ్లామర్ తో కూడిన కమర్షియల్ సినిమాలు చేస్తోంది.. మరోపక్క లేడీ ఓరియంటెడ్ పెక్యులర్ మూవీస్ కి కూడా సిద్ధంగా ఉంది.

కమర్షియల్ సినిమాలు ,గ్లామర్ షోలు అతి తక్కువ సమయంలో విజయాన్ని తీసుకువస్తాయి. కానీ రిస్క్ తో కూడిన పాత్రలు చేస్తేనే కదా మనం ఏంటో తెలుస్తుంది అంటుంది ఈ బ్యూటీ. ‘రిస్క్ తో కూడిన పాత్రలో ఉన్న సినిమాలలో నా నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోవాలి అని భావిస్తాను. అందుకే చిన్న సినిమాలనే ఎంచుకుంటున్నాను. ప్రతి సినిమాలో దర్శకుడు నా నుంచి ఏమి కోరుకుంటారో అది 100% ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.. ఇప్పటివరకు నేను నా కెరీర్లో రెండు హైరిస్క్ సినిమాలను ఎంచుకున్నాను.. వాటిలో విడుదల కాబోతున్న 'ఉలఝ' ఒకటి. ఈ మూవీ ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.'అని ఈ బ్యూటీ ఇంటర్వ్యూలో చెప్పింది.

నిన్న మొన్నటి వరకు దేవర షూటింగ్లో చాలా బిజీగా ఉన్న జాన్వీ.. ప్రస్తుతం తన సరికొత్త మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నుంచి దేశభక్తి చిత్రాలు విడుదలవుతూ ఉంటాయి. జాన్వీ నటించిన 'ఉలఝ'మూవీ కూడా దేశభక్తి కథాంశం తో సాగుతుంది. ఇండియన్ ఫారెన్ సర్వీస్ నేపథ్యంలో సాగే ఒక థ్రిల్లర్ మూవీ గా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చిత్రంపై అంచనాలను బాగా పెంచింది.

Tags:    

Similar News