డబ్బులిచ్చి భజన చేయించుకోవాల్సిన పనిలేదు!
జాన్వీకపూర్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ పరిశ్రమల్లో అమ్మడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
జాన్వీకపూర్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ పరిశ్రమల్లో అమ్మడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అవకాశాలు క్యూలో ఉన్నాయి. జాన్వీ ఒప్పు కోవాలే గానీ కోట్లు గుమ్మరించి డేట్లు లాక్ చేయాలని నిర్మాతలంతా వెయిట్ చేస్తున్నారు. సొంత భాషలోనూ అవకాశాలు బాగానే వస్తున్నాయి. కానీ అమ్మడు కంగారుపడి కమిట్ అవ్వడం లేదు. కొత్తప్రాజెక్ట్ ఏదైనా ఆచితూచి వ్యవహరిస్తుంది.
నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే ఒకే చేస్తుంది. బిగ్ స్టార్స్ తో అవకాశాలు వచ్చినా? నటనకు ఛాన్స్ లేని చిత్రాలకైతే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా ప్రమోషన్ ని ఉద్దేశించిజాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `నటిగా నేను ఎలా రాణిస్తున్నాను అన్నది ప్రేక్షకులు నిర్ణయించాలి. వచ్చిన ప్రతీ అవకాశాన్నిసద్వినియోగం చేసుకుంటున్నాను. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నడుస్తోంది.
ఇక్కడ మనల్ని పొగిడేవారే కాదు..తిట్టే వారు కూడా ఉంటారు. అన్ లైన్ వేదికగా నెటి జనులు ఎవరైనా ప్రశంశిస్తే వాళ్లంతా నా పీఆర్ ఆన్నట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్లందరికీ నేను డబ్బులిచ్చి నా గురించి పాజిటివ్ గాపోస్ట్ లు పెట్టండి అని రాయిస్తున్నాను అనుకుంటున్నారు. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. అంత అవసరం నాకు లేదు. అయినా ఎన్ని డబ్బులిచ్చి ఎంత మందిని కొనగలం.
ఈ చిన్నలాజిక్ మిస్ అయితే ఎలా. ఇలాంటి పనులు నాకు చేతకాదు. నా లో సత్తా ఉంటే నటిగా కొన సాగుతా. లేకపోతే లేదు. మరో పనిలో పడిపోతాను. అంతేగానీ ఇలాంటి చేతగాని పనులు చేయను` అని క్లారిటీ ఇచ్చింది. త్వరలో జాన్వీ ఉలఝ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం అమ్మడు ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది.