జేడీ చక్రవర్తి హీరోగా మహేశ్వరి హీరోయిన్ గా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడిగా కృష్ణవంశీకి అది మొదటి సినిమా.. హీరోగా జేడీ చక్రవర్తి కి అది మొదటి సినిమా.. అయినా కూడా ఇద్దరికి లైఫ్ టైమ్ గుర్తుండిపోయేంత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
తాజాగా సినిమా ముచ్చట్లను హీరో జేడీ చక్రవర్తి మీడియాతో పంచుకున్నాడు. ఆయన నటించిన మొదటి వెబ్ సిరీస్ దయా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడుతూ తన మొదటి సినిమా గులాబీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. గులాబీ సినిమా కు హీరోగా మొదటి ఛాయిస్ తాను కాదని జేడీ పేర్కొన్నాడు.
కృష్ణవంశీ గులాబీ సినిమా కథ ను వేరే హీరోకు వినిపించి షూటింగ్ మొదలు పెట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల వెంటనే ఆ సినిమా ఆగిపోయింది. దాంతో నేనే స్వయంగా సీనియర్ హీరో రాజశేఖర్ వద్దకు కృష్ణవంశీని తీసుకుని వెళ్లి కథ చెప్పించాను. నేను కృష్ణవంశీని రాజశేఖర్ వద్దకు తీసుకు వెళ్లిన సమయంలో వేరే కథ చెప్పడంతో మధ్యలో ఆపి గులాబీ కథను చెప్పించాను.
కథ నచ్చిన రాజశేఖర్ గులాబీ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతే కాకుండా ముఖ్యమైన బ్రహ్మాజీ పోషించిన పాత్ర ను నన్ను చేయమని ఆయన సూచించాడు.
అంతా ఓకే అనుకున్నాం.. అక్కడ నుండి బయటకు వచ్చాక.. కథ కు నువ్వు అయితేనే బాగుంటుంది. అందుకే రాజశేఖర్ కాకుండా నువ్వే హీరోగా చేయాల్సిందే అంటూ కృష్ణవంశీ పట్టుబడట్టాడు.
రాజశేఖర్ కథ కు ఓకే చెప్పి నటించేందుకు ఓకే చెప్పిన తర్వాత గులాబీ సినిమా నా చేతిలోకి వచ్చిందని జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. గులాబీ సినిమా ను ఒక వేళ యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ కొట్టి ఉంటే ఫలితం ఎలా ఉండోదే.. ఇక జేడీ చక్రవర్తి దయా సిరీస్ తో తన పూర్వ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.