IAS కూతురు అగ్రనటిగా ఎదిగాక విడోవర్‌ని పెళ్లాడి!
80వ దశకం మధ్యలో ఓ ఐఏఎస్ అధికారి కూతురు సినిమా రంగంలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే సూపర్‌స్టార్ అయింది.
80వ దశకం మధ్యలో ఓ ఐఏఎస్ అధికారి కూతురు సినిమా రంగంలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే సూపర్‌స్టార్ అయింది. ఈ నటి తన కెరీర్‌లో పీక్‌లో ఉన్నప్పుడు వితంతువు(విడోవర్) అయిన వ్యక్తిని వివాహం చేసుకుంది. మొదటి బిడ్డతో గర్భవతి అయ్యే వరకు ఈ పెళ్లి సంగతిని దాచి పెట్టింది. కథానాయికగా కెరీర్ మొత్తంలో ఇండస్ట్రీ బెస్ట్ స్టార్లతో నటించింది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అమీర్ ఖాన్, సన్నీ డియోల్, రిషి కపూర్, నాగార్జున వంటి అనేక మంది సూపర్ స్టార్లతో పని చేసింది. ఈ నటి మరెవరో కాదు.. జూహీ చావ్లా.. 1984 మిస్ ఇండియా అందాల పోటీలో కిరీటాన్ని గెలుచుకున్న జూహీ 1986లో `సుల్తానత్`లో సహాయ పాత్రతో సినీ అరంగేట్రం చేసింది.
బ్లాక్ బస్టర్ `ఖయామత్ సే ఖయామత్ తక్` (1988) చిత్రంతో తన తరంలో సూపర్‌స్టార్‌గా స్థిరపడింది. జుహీ చావ్లా ఇప్పటికే విజయవంతమైన కెరీర్‌ను కలిగి ఉంది. జూహీ పెళ్లి చేసుకుని కుటుంబాన్ని కలిగి ఉండాలని నిర్ణయించుకుంది. కెరీర్‌లో ఓడిపోతామనే భయంతో పెళ్లి విషయాన్ని చాలా కాలంగా దాచిపెట్టింది. జుహు చావ్లా పారిశ్రామికవేత్త జే మెహతాను 1995 నుండి వివాహం చేసుకున్నారు. వారు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. జాన్వి అనే కూతురు, అర్జున్ అనే కొడుకు ఉన్నారు.
జే మెహతా భారతదేశంలో పాపులర్ వ్యాపారవేత్త. భారత్, ఆఫ్రికా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ అంతటా వ్యాపారాలను కలిగి ఉన్న మెహతా గ్రూప్ ఛైర్మన్. తాజా కథనాల ప్రకారం జే మెహతా నికర ఆస్తుల విలువ 1000-2400 కోట్ల రూపాయలు. మరోవైపు మెహతా గ్రూప్ సుమారు USD 500 మిలియన్ల (రూ. 4130 కోట్లు) ఆస్తులను కలిగి ఉంది. జే మెహతా - జూహీ చావ్లా విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నారు. భారతదేశం అంతటా రాజభవన గృహాలను మాత్రమే కాకుండా భారీ కార్ల సముదాయాన్ని కూడా కలిగి ఉన్నారు. IPL జట్టు (కోల్‌కతా నైట్ రైడర్స్) లో షారూఖ్ ఖాన్‌తో సహభాగస్వాములుగా ఉన్నారు.
జూహీ చావ్లా- జే మెహతా ముంబైలోని మలబార్ హిల్స్‌లో ఉన్న మెహతా కుటుంబానికి చెందిన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. కుటుంబం రెండు అంతస్తులలో నివసిస్తుండగా, మిగిలిన రెండు అంతస్తులలో వారి ఆర్ట్ సేకరణ ఉంది. వారి ముంబై ఇంటితో పాటు, జుహీ చావ్లా- జే మెహతా గుజరాత్ పోర్‌బందర్‌లో హిల్ బంగ్లా అనే పూర్వీకుల ఇంటిని కూడా కలిగి ఉన్నారు. దీనిని చన్నా దాస్వత్తె రీడిజైన్ చేశారు.
పవర్ కపుల్ జూహీ-జే మెహతా షారుఖ్ ఖాన్‌తో పాటు IPL జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సహ-యజమానిగా ఉన్నారు, వారు 2007లో $75.09 మిలియన్లకు (సుమారు రూ. 623 కోట్లు) ఈ టీమ్‌ని కొనుగోలు చేశారు. 2022 నాటికి ఫోర్బ్స్ ప్రకారం KKR విలువ $1.1 బిలియన్లు (సుమారు రూ. 9,139 కోట్లు). జే మెహతా- జుహీ చావ్లా విలాసవంతమైన కార్ల సముదాయాన్ని కలిగి ఉన్నారు. అలాగే BMW 7 సిరీస్ ధర రూ. 1.8 కోట్లు. ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ ధర రూ. 3.3 కోట్లు.