అక్కడ ఇండస్ట్రీపై జ్యోతిక మనసు విరిగిపోయిందా!
చాలా కాలం తర్వాత ఇటీవలే రిలీజ్ అయిన `షైతాన్` తో హిందీలో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
జ్యోతిక సెకెండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మకాం చెన్నై నుంచి ముంబైకి షిప్ట్ చేసిన తర్వాత మరింత యాక్టివ్ గా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం అంతే యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ముంబై నుంచే కెరీర్ సాగిస్తున్నారు. దేశంలో అన్ని భాషల్లోనూ నటించడానికి సిద్దంగా ఉన్నట్లు కూడా రివీల్ చేసారు. అందుకు తగ్గట్టు జ్యోతిక కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా కాలం తర్వాత ఇటీవలే రిలీజ్ అయిన `షైతాన్` తో హిందీలో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆమె నటించిన మరో హిందీ చిత్రం `శ్రీకాంత్` నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లాం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో జ్యోతిక టీచర్ పాత్రలో నటించారు. అయితే హిందీలో గ్యాప్ రావడానికి గల కారణాల్ని తాజాగా జ్యోతిక రివీల్ చేసారు. `తొలి చిత్రంపైనే కెరీర్ ఆధారపడి ఉంటుందని బలంగా నమ్ముతాను. నేను నటించిన మొదటి హిందీ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో మళ్లీ అక్కడ అవకాశాలు రాలేదు. సౌత్ లో నటించిన ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి.
స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కింది. అయినా బాలీవుడ్ నుంచి అవకాశాలు రాలేదు. ప్రేక్షకులు నన్ను దక్షిణాది నటిగానే గుర్తుంచుకున్నారు. అందుకే నాకూ బాలీవుడ్ సినిమాల్లో నటించాలనే ఆసక్తి కూడా లేదు` అని అన్నారు. ఆమె అన్నట్లు గానే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇక్కడే ప్లాన్ చేసుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ప్రేమలో పడ్డారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా కలరు. సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు.
అలా జ్యోతిక జీవితమంతా దక్షిణాది పరిశ్రమలతోనూ ముడి పడి ఉంది. కానీ తాజాగా హిందీలో `షైతాన్` తో మంచి కంబ్యాక్ లభించింది కాబట్టి మళ్లీ సినిమాలు చేసే అవకాశం లేకపోలేదు. పైగా కాపురం కూడా ముంబైలోనే కాబట్టి సెకెండ్ ఛాన్స్ తీసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.