'క' కలెక్షన్లు.. కిరణ్ నయా రికార్డు
దీంతో ఈ చిత్రం ఏకంగా రూ. 19.41 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.
కొంత కాలంగా తెలుగు సినిమా రంగంలో ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా రూపొందుతోన్నాయి. అలా ఇప్పుడు ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చేసిన సినిమానే ‘క’. చాలా కాలంగా బిగ్గెస్ట్ హిట్ కోసం ఎదురు చూస్తోన్న కిరణ్ అబ్బవరం నటించిన ఈ మూవీ.. గతంలో చూడని సరికొత్త కాన్సెప్టుతో తెరకెక్కింది. దీంతో ఇది అంచనాలను భారీగా ఏర్పరచుకుని దీపావళి కానుకగా విడుదల అయింది.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్, సందీప్ దర్శకత్వంలో వచ్చిన సినిమానే ‘క’. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాల వల్ల దీనిపై ఆసక్తి పెరిగింది. ఫలితంగా ఇది హిట్ అవుతుందన్న నమ్మకం చాలా మందిలో ఏర్పడింది. దీన్ని నిలబెట్టుకుంటూ ప్రీమియర్స్ నుంచే కిరణ్ అబ్బవరం సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో రెస్పాన్స్ కూడా ఊహించని విధంగానే లభిస్తోంది.
దీపావళి సందర్భంగా పలు సినిమాలు విడుదలైనా.. కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ మొదటి రోజు రూ. 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సత్తా చాటుకుంది. అదే ఊపును కంటిన్యూ చేస్తూ రెండో రోజు కాసింత ఎక్కువగానే గ్రాస్‌ను రాబట్టింది. ఇక, మూడో రోజు ఈ చిత్రం మరింతగా పుంజుకుంది. తద్వారా మొదటి రెండు రోజుల కంటే ఎక్కువగానే కలెక్షన్లను సాధించి ఔరా అనిపించింది.
కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన ‘క’ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల ఆడియెన్స్ నుంచి మూడు రోజుల్లో దిమ్మతిరిగే రెస్పాన్స్ సొంతం అయింది. దీంతో ఈ చిత్రం ఏకంగా రూ. 19.41 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది. తద్వారా విజయానికి మరింత చేరువగా రావడంతో పాటు కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే వేగంగా రూ. 19 కోట్లు గ్రాస్‌ను సాధించిన చిత్రంగా ఇది నయా రికార్డును నమోదు చేసింది.
క్రేజీ కంటెంట్‌తో రూపొందిన ‘క’ సినిమాకు పలు రకాల రైట్స్ ద్వారా టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. థియేట్రికల్ పరంగా ఇది రూ. 10 కోట్లు వరకూ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే దాదాపు రూ. 22 కోట్లు గ్రాస్ వసూలు అయితే ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ లెక్కన చూసుకుంటే కిరణ్ అబ్బవరం చిత్రం నాలుగు రోజుల్లోనే టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
ఎంతో హైప్ క్రియేట్ చేసుకుని రిలీజ్ అయిన ‘క’ సినిమా వాస్తవానికి వేరే సినిమాల నుంచి తీవ్ర పోటీ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 340 థియేటర్లలోనే విడుదలైంది. కానీ, ఆ తర్వాత పబ్లిక్ డిమాండ్ మేరకు థియేటర్ల సంఖ్యను 550కి పెంచారు. అందుకే దీనికి వసూళ్లు పోటెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి కిరణ్ మాస్ బ్యాటింగ్ కప్ కొట్టే దిశగా సాగుతోందన్న మాట.