.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

కల్కి బాక్సాఫీస్.. 4 రోజుల్లో ఊచకోత!

ఇదే జోరు కొనసాగితే సలార్ మీద ఉన్న 15+ మిలియన్ డాలర్స్ రికార్డ్ ని త్వరలో బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Update: 2024-07-01 11:32 GMT

కల్కి 2898ఏడీ మూవీ కలెక్షన్స్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ కావడంతో థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. తెలుగు, హిందీ వెర్షన్స్ కి మంచి ఆదరణ వస్తూ ఉండగా ఇతర భాషలలో కూడా బాగుందనే టాక్ తో మెల్లగా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారు. ఓవర్సీస్ లో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో 11 మిలియన్ డాలర్స్ ని కల్కి మూవీ క్రాస్ చేసింది.


ఇదే జోరు కొనసాగితే సలార్ మీద ఉన్న 15+ మిలియన్ డాలర్స్ రికార్డ్ ని త్వరలో బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రతి రోజు వచ్చే కలెక్షన్స్ ని వైజయంతీ మూవీస్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తోంది. నాలుగు రోజుల్లో వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పోస్టర్ ని నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. ఓవరాల్ గా 555 కోట్ల గ్రాస్ కల్కి 2898ఏడీ చిత్రానికి వచ్చినట్లు పోస్టర్ లో కన్ఫర్మ్ చేశారు.

నాలుగు రోజుల్లో 555 కోట్లు అంటే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏ సినిమాకి ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. అయితే కల్కి మూవీ ఇటు మైథాలజీ, అటు సైన్స్ ఫిక్షన్ కలిపిన ఫ్యూచరిస్టిక్ మూవీగా తీయడంతో ప్రేక్షకులు కొత్తదనం ఫీల్ అవుతున్నారు. హిందీ వెర్షన్ నాలుగో రోజు ఏకంగా 114 కోట్లు కలెక్ట్ చేసిందంట. ఇది రికార్డ్ అనే మాట వినిపిస్తోంది. నాలుగో రోజు హిందీలో 100+ కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ మూవీగా కల్కి నిలిచింది.

Read more!

ఓవరాల్ గా నాలుగో రోజు 140 కోట్ల గ్రాస్ వసూళ్లు అయినట్లు తెలుస్తోంది. దీంతో 555 మార్క్ ని టోటల్ కలెక్షన్స్ అందుకుంది. ఐదో రోజు సోమవారం కూడా 90 నుంచి 100 కోట్ల మధ్యలో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 650+ కోట్ల కలెక్షన్స్ ని ఆరు ఐదు రోజుల్లోనే అందుకున్న మొట్టమొదటి చిత్రం కల్కి అవుతుంది. అలాగే బాహుబలి 1 టోటల్ కలెక్షన్స్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందంట.

కల్కి 2898ఏడీని 2డీతో పాటు 3డీ వెర్షన్ లో కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రేక్షకులు 3డీలో కంటే 2డీలోనే చూడటానికి ఇష్టపడుతున్నారంట. 3డీ వెర్షన్ చూసిన వారు కూడా మళ్ళీ 2డీలో చూడటానికి థియేటర్స్ కి వస్తున్నారంట. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు కాస్తా ఎక్కువ ఉన్నాయి. వారం రోజుల తర్వాత టికెట్ రేట్లు ఏమైనా తగ్గిస్తే సామాన్య, మధ్యతరగతి ప్రజలు మూవీని చూడటానికి థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తారా అనేది చూడాలి.

Tags:    

Similar News