కల్కి మొత్తం ఎన్ని పార్ట్‌లు

ఐతే ఈ కథ ఇంకా ఎన్ని భాగాలు ఉంటుంది.. ఎప్పుడు ముగుస్తుంది అనే విషయాల్లో క్లారిటీ లేదు. ‘కల్కి’ నిర్మాత అశ్వినీదత్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు.

Update: 2024-06-30 23:30 GMT

టాలీవుడ్ మరోసారి ప్రపంచం ముందు తలెత్తుకునేలా చేసిన సినిమా.. కల్కి 2898 ఏడీ. ఇప్పటికే మన ఇండస్ట్రీ నుంచి బాహుబలి, ఆర్ఆర్ఆర్, హనుమాన్ లాంటి భారీ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించి మన సినిమా ఖ్యాతిని పెంచగా.. ఇప్పుడు ‘కల్కి’ లాంటి విజువల్ వండర్ రావడంతో అందరూ మరోసారి తెలుగు సినిమా గురించి చర్చించుకుంటున్నారు.

తొలి వీకెండ్లో ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. ‘కల్కి’ కథ ఇంతటితో ముగిసిపోలేదని.. దీనికి కొనసాగింపు ఉంటుందని మేకర్స్ సినిమాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కల్కి’ ప్రపంచం కొనసాగుతుంది అని చివర్లో పేర్కొన్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఐతే ఈ కథ ఇంకా ఎన్ని భాగాలు ఉంటుంది.. ఎప్పుడు ముగుస్తుంది అనే విషయాల్లో క్లారిటీ లేదు. ‘కల్కి’ నిర్మాత అశ్వినీదత్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు.

‘కల్కి’ కథ రెండు భాగాలే అని.. సెకండ్ పార్ట్‌తో ఈ కథ ముగిసిపోతుందని చెప్పాడు. ఆల్రెడీ సెకండ్ పార్ట్‌కు సంబంధించి 60 శాతం చిత్రీకరణ కూడా పూర్తయిందని ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఎప్పుడు రిలీజవుతుందో మాత్రం చెప్పలేనన్నాడు. 2026లో ‘కల్కి-2’ రిలీజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘కల్కి’ కథను రెండో భాగంతో ముగించినప్పటికీ.. ఇందులో విలన్ పాత్ర మీద స్టాండ్ అలోన్ మూవీ ఉండొచ్చని అశ్వినీదత్ వెల్లడించడం విశేషం.

కమల్ హాసన్ చేసిన సుప్రీం యాస్కిన్ పాత్ర సినిమాలో అమితాసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. కానీ ఆ పాత్రను సినిమాలో పెద్దగా చూపించలేదు. సెకండ్ పార్ట్‌లో ప్రభాస్, కమల్‌ల మధ్య భారీ పోరాటం ఉంటుందని.. కమల్, ప్రభాస్, అమితాబ్ కలిసి కనిపించే సన్నివేశాలు ఫీస్ట్ అని చెప్పిన దత్.. సుప్రీం యాస్కిన్, అతడి కాంప్లెక్స్ కథ స్పెషల్‌గా ఉంటుందని.. దాని మీద వేరే సినిమా రావచ్చని చెప్పారు. కమల్ నటించిన ‘విక్రమ్‌’లో చివర్లో కనిపించే రోలెక్స్ పాత్ర మీద కూడా ఒక స్టాండ్ అలోన్ మూవీ చేయాలని దర్శకుడు లోకేష్ కనకరాజ్ భావిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News