కల్కి 2898ఏడీ: నార్త్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..
అలాంటిది కల్కి 2898ఏడీ చిత్రానికి ఏకంగా 77% ఆక్యుపెన్సీ వచ్చిందని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తెలియజేశాడు. దీనిని బట్టి కల్కి మూవీ ఏ స్థాయిలో పబ్లిక్ లోకి చొచ్చుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు.
టాలీవుడ్ నుంచి వచ్చిన మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898ఏడీ సినిమా జూన్ 27న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా 8500 స్క్రీన్స్ లో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మెజారిటీ ఆడియన్స్ నుంచి సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండటం విశేషం. ఇండియన్ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి తెరపై నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడని ప్రేక్షకులు గొప్పగా చెబుతున్నారు.
ముఖ్యంగా కల్కి సినిమాకి తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డార్లింగ్ ప్రభాస్ కి ఎక్కువ ఫ్యాన్స్ బేస్ ఈ మూడు ప్రాంతాలలో ఉంటారు. ఇక నార్త్ ఇండియాలో సెంట్రల్ స్టేట్స్, సిటీల వరకు మాత్రమే తెలుగు సినిమా గతంలో పరిమితం అయ్యేది. అయితే ఇప్పుడు రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో చిన్న చిన్న టౌన్స్ లకి కూడా కల్కి మూవీ రీచ్ అయ్యింది.
రాజస్థాన్ లో టోంక్ టౌన్ లో డబ్బింగ్ సినిమాలకి 20 శాతం ఆక్యుపెన్సీ వస్తేనే మంచి ఆదరణ వచ్చినట్లు భావిస్తారు. అలాంటిది కల్కి 2898ఏడీ చిత్రానికి ఏకంగా 77% ఆక్యుపెన్సీ వచ్చిందని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తెలియజేశాడు. దీనిని బట్టి కల్కి మూవీ ఏ స్థాయిలో పబ్లిక్ లోకి చొచ్చుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి కల్కి 2898ఏడీ సినిమాకి ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ చేయలేదు.
అయితే ప్రభాస్ స్టార్ ఇమేజ్, కల్కి మూవీ కంటెంట్ పట్ల ప్రజలకి ఉన్న ఆసక్తి ఆక్యుపెన్సీ పెరగడానికి కారణం అని తెలుస్తోంది. సుమారు 3 గంటల నిడివి ఉన్న సినిమా అయిన ప్రేక్షకులు చిన్న చిన్న టౌన్స్ లో కూడా ప్రేక్షకులు మూవీ చూడటానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నట్లు సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రేక్షకులని ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ మూవీలో ఉండటం వలనే ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుందని అంటున్నారు.
మల్టీప్లెక్స్ థియేటర్స్ లో కూడా సినిమాకి ఆడియన్స్ నుంచి విజిల్స్ పడటం కల్కి చిత్రానికే కనిపించిందని చెబుతున్నారు. కచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు హైయెస్ట్ కలెక్షన్స్ ని రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యం ఈ మూడు రోజులు టికెట్ బుకింగ్స్ భారీగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమా ఇంకా ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.