కల్కి.. రెండో రోజు కూడా పెద్ద లెక్కే..

ఇప్పుడు రెండో రోజు కూడా మంచి వసూళ్లే రాబట్టింది. రూ.50 కోట్ల మార్కును అందుకుంది.

Update: 2024-06-29 05:59 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రిలీజైన అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్ సంపాదించుకుని దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. గురువారం వర్కింగ్ డే అయినప్పటికీ భారీ ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో మూవీగా కల్కి రికార్డు క్రియేట్ చేసింది.

మొదటి రోజు రూ.100 కోట్ల రికార్డు సాధించిన 11వ చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.191.5 కోట్ల వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది. ఇప్పుడు రెండో రోజు కూడా మంచి వసూళ్లే రాబట్టింది. రూ.50 కోట్ల మార్కును అందుకుంది. sacnilk రిపోర్ట్ ప్రకారం.. కల్కి రూ.54 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు వసూళ్లు తగ్గినా.. వీకెండ్ లో మాత్రం వేరే లెవెల్ లో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అయితే ఇండియాలో కల్కికి తొలి రోజు రూ.95.3 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.24.65 కోట్లు, తమిళనాడులో రూ.3.5 కోట్లు, బాలీవుడ్ లో రూ. 20.5 కోట్లు, కర్ణాటకలో రూ.0.3 కోట్లు, కేరళలో రూ.2 కోట్లు వచ్చినట్లు తెలిపింది. అయితే శని ఆదివారాల్లో కల్కికి రికార్డు స్థాయిలో వసూళ్లు రావడం పక్కా అని తెలుస్తోంది. వీకెండ్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవల్ లో జరిగినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

Read more!

ఇక సినిమా విషయానికొస్తే.. పురాణాల నుంచి తీసుకున్న కాన్సెప్ట్ కు సైన్స్ ఫిక్షన్ ను యాడ్ చేసి తెరకెక్కించారు నాగ్ అశ్విన్. మేకింగ్, గ్రాఫిక్స్, క్యారెక్టరైజేషన్ అలా అన్ని విషయాల్లో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. హాలీవుడ్ రేంజ్ మూవీ అని కొనియాడుతున్నారు. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ యాక్టింగ్ కు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పుడు పార్ట్-2 కోసం అంతా మాట్లాడుకుంటున్నారు. కమల్ కూడా తన రోల్ సెకండ్ పార్ట్ లో ఎక్కువ ఉంటుందని చెప్పి భారీ అంచనాలు క్రియేట్ చేశారు. దీంతో సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారు. ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉన్న మూవీ టీమ్.. కాస్త రెస్ట్ తీసుకుని వర్క్స్ స్టార్ట్ చేస్తారని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే కల్కి పార్ట్-1.. తొలి వారంలో ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News