షారూఖ్ 'జ‌వాన్' రికార్డులు బ్రేక్ చేసిన 'క‌ల్కి'

సెప్టెంబరులో జవాన్ విడుద‌ల కాగా, ఒక‌ గంటలోపు 86 వేల టిక్కెట్లను విక్రయించి రికార్డ్ నెల‌కొల్పింది. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయింది.

Update: 2024-07-01 04:10 GMT

కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతోంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు రాబట్టింది. ఇప్పుడు బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లో టిక్కెట్‌ విక్రయాల్లో స‌రికొత్త రికార్డు సృష్టించింది.

భార‌త‌దేశంలోని ఏదైనా ఒక సినిమాకి సంబంధించి ఒక గంట‌లో గ‌రిష్ఠంగా ఎన్ని టిక్కెట్లు సేల్ అయ్యాయి? అలాంటి ఒక రికార్డు ఏదైనా ఉందా? అంటే దానికి స‌మాధానం ల‌భించింది. ఇప్పుడ అలాంటి ఒక అరుదైన రికార్డ్ బ్రేక్ అయింది. నిన్న మధ్యాహ్నం 1 గం.కు 'కల్కి 2898 AD'కి సంబంధించి గ‌రిష్ఠంగా 90k టిక్కెట్లు అమ్ముడయ్యాయి. బుక్‌మైషో ఒక గంట వ్యవధిలో 93.77k టిక్కెట్లు అమ్ముడయ్యాయని వెల్లడించింది. ఈ సినిమా కొత్త రికార్డు సృష్టించింది. గతంలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ ఈ రికార్డును నెలకొల్పింది. సెప్టెంబరులో జవాన్ విడుద‌ల కాగా, ఒక‌ గంటలోపు 86 వేల టిక్కెట్లను విక్రయించి రికార్డ్ నెల‌కొల్పింది. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయింది.

'కల్కి 2898 AD' మహాభారతం నుండి ఎక్కువగా ప్రేరణ పొంది రూపొందించిన సినిమా. ఈ చిత్రం డిస్టోపియన్ ఫ్యూచర్‌లో న‌డిచే క‌థ‌తో తెర‌కెక్కింది. నలుగురు వ్యక్తుల చుట్టూ క‌థాంశం తిరుగుతుంది - సుమతి అనే గర్భిణీ స్త్రీ (దీపికా పదుకొణె), విష్ణువు 10వ అవతారమైన బిడ్డను మోస్తున్నట్లు సినిమాలో చూపించారు. అమరుడైన అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్ పోషించినది) పుట్టబోయే బిడ్డను రక్షించడానికి బాధ్యతను స్వీక‌రిస్తాడు. సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) అనే క్రూరమైన విలన్ త‌న అంతానికి ఆ పిల్లవాడు కార‌ణ‌మ‌వుతాడని తెలుసు కాబట్టి పిల్లవాడు చనిపోవాలని కోరుకుంటాడు. ఇందులో భైరవ (ప్రభాస్) డబ్బు కోసం ఎవరినైనా అమ్మే ఒక బౌంటీ హంటర్.

సాక్ నిల్క్ డాట్ కాం క‌థ‌నం ప్రకారం 'కల్కి 2898 AD' శనివారం నాటికి, అంటే 3వ రోజున రూ. 67.1 కోట్ల‌ ఇండియా వైడ్ నెట్‌ని వసూలు చేసింది. దీంతో కల్కి 2898 AD భారతదేశంలో కేవలం మూడు రోజుల్లోనే రూ. 220 Cr (సుమారు) వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా తెలుగు షోలు (రూ. 126.9 కోట్లు), హిందీ (రూ. 72.5 కోట్లు), తమిళం (రూ. 12.8 కోట్లు) వ‌సూల‌య్యాయి. కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద కేవలం మూడవ రోజు 100 కోట్ల రూపాయల (గ్రాస్) వసూలు చేసింది. ఈ ఆదివారం నాడు దాదాపు మ‌రో 120 కోట్లు పైగా వ‌సూలు చేసి ఉంటుంద‌ని అంచ‌నా. ఇది క‌లుపుకుంటే ఇప్ప‌టికే 300 కోట్ల వసూళ్ల క్లబ్ ని క‌ల్కి అధిగ‌మించి ఉంటుంది.

క్రియేటివ్ జీనియ‌స్ నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ సినిమా అందరికీ నచ్చుతోంది. చాలా స‌మీక్ష‌ల్లో 3/5 రేటింగ్ క‌నిపించ‌గా, కొన్ని బాలీవుడ్ వెబ్ సైట్లు ఈ చిత్రానికి 4/5 రేటింగ్ ఇవ్వ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , దీపిక‌, ప్రభాస్ నటనకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

Tags:    

Similar News