కల్కి 2898 AD.. ఆ విషయంలో తేడా కొట్టేసింది?
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి ఊహించని స్పందనను పొందింది.
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి ఊహించని స్పందనను పొందింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ డల్ గా ఉన్నా కూడా, ప్రేక్షకుల జోష్ చూస్తే సినిమా మొత్తాన్ని తప్పక చూడాల్సిందే అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా చివరి అరగంటలో ఉన్న సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని అందరూ ఏకగ్రీవంగా చెప్పుకుంటున్నారు.
అయితే కల్కి చిత్రం 3D లో కూడా విడుదలైంది, కానీ ఈ విషయాన్ని ప్రచారంలో మేకర్స్ అంతగా హైలెట్ చేస్తూ చెప్పలేదు. 3D లో సినిమా చూడాలా లేదా అనే సందేహంలో చాలా మంది ప్రేక్షకులు ఉన్నారు. సాధారణంగా మన ఆడియెన్స్ ఇండియన్ సినిమాలు 3D లో వస్తే అంతగా ఫోకస్ చేయరు. RRR టైమ్ లో కూడా జక్కన్న అంతగా హైలెట్ చేయలేదు. ఆ సైడ్ నుంచి పెద్దగా పాజిటివ్ టాక్ ఏమి రాలేదు
ఇక కల్కి విషయానికి వస్తే అయితే 3D అనుభవం అందులోని కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమైందని, మొత్తం సినిమాలో 3D అనుభూతి అంతగా లభించలేదని కొన్ని టాక్‌లు వినిపిస్తున్నాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే 3D - 2D అని సంబంధం లేకుండా జనాలు ఎగబడ్డారు. అయితే 3D లో చూసిన వారు మళ్ళీ 2D లో చూడాలనే విధంగా కామెంట్స్ కూడా పెడుతున్నారు. కాబట్టి రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రేక్షకులు తరచుగా ‘అవతార్’ వంటి చిత్రాలను చూసిన తర్వాత అదే స్థాయి 3D అనుభవాన్ని ఆశిస్తారు. కానీ ‘కల్కి 2898 AD’ 3D ఎఫెక్ట్స్ లో ఆ స్థాయి అనుభవం ఇవ్వలేకపోయింది. కొన్ని సన్నివేశాలలో మాత్రమే 3D ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగా, మూడు గంటల పాటు నల్ల కళ్లద్దాలు ధరించి 3D లో సినిమా చూడడం ఎందుకని కొందరు భావిస్తున్నారు.
వాస్తవానికి 2D లో సినిమా చూస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని అంటున్నారు. బ్రైట్ స్క్రీన్ మరియు భారీ విజువల్స్ 2D లోనే ఎక్కువ అనుభూతిని ఇస్తాయని కొందరు ప్రేక్షకులు అంటున్నారు. 2D మరియు 3D రెండూ చూసిన ప్రేక్షకులు కూడా 2D లో పూర్తి అనుభూతి లభిస్తుందని, 3D కోసం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. అయితే మంచి స్క్రీన్, ఉత్తమ 3D ప్రొజెక్షన్ ఉన్న థియేటర్లలో 3D అనుభవం కోసం అవకాశం ఉంటే, 3D లో చూడటం మంచి అనుభవంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ సాధారణ థియేటర్లలో 2D లో చూసినా రిగ్రెట్స్ ఉండవని వారు అంటున్నారు.