కల్కి ఎంత ప్లస్సో అంత మైనస్..!

నార్త్ ఆడియన్స్ కు ప్రభాస్ కేవలం ఒక యాక్షన్ హీరోగానే తెలుసు.

Update: 2024-07-05 05:30 GMT

నార్త్ ఆడియన్స్ కు ప్రభాస్ కేవలం ఒక యాక్షన్ హీరోగానే తెలుసు. బాహుబలి నుంచి ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. ఐతే ఆ సినిమాల్లో పాత్రలన్నీ కూడా సీరియస్ గా ఉంటూ వచ్చాయి. మన డార్లింగ్ కామెడీ టైమింగ్ అసలు బాలీవుడ్ ఆడియన్స్ కు తెలియదు. అందుకే నాగ్ అశ్విన్ కల్కి సినిమాలో భైరవ పాత్రని ఎంటర్టైనింగ్ గా రాసుకున్నాడు. ప్రభాస్ నుంచి ఇలాంటి కామెడీ ఊహించని బీ టౌన్ ఆడియన్స్ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.

ఐతే కల్కి సినిమా విజయానికి ప్రభాస్ ఒక్కడే కాదు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె ఇలా ఎవరి పాత్రలో వారు ది బెస్ట్ ఇచ్చారు కాబట్టే సినిమా అంత బాగా వచ్చింది. కల్కి సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ ప్రభాస్ చేయబోయే నెక్స్ట్ సినిమాల మీద ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న రాజా సాబ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కల్కి లో ప్రభాస్ ని చూసిన ఆడియన్స్ రాజా సాబ్ లాంటి సినిమాలో యాక్సెప్ట్ చేస్తారా అన్న డౌట్ మొదలైంది. ఐతే ఈ అంచనాలు సినిమాకు ఎంత మంచి చేస్తాయో అదే విధంగా చెడు కూడా చేస్తాయి.

Read more!

బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యాం సినిమాలతో నిరాశ పరిచిన ప్రభాస్ ఆ రెండు సినిమాల మీద ఉన్న అంచనాలను అందుకోకపోవడమే కారణమని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు కల్కి తర్వాత రాజా సాబ్ అంటూ రాబోతున్నాడు. మారుతి ప్రభాస్ ని ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మరోపక్క సందీప్ వంగ తో కూడా ప్రభాస్ స్పిరిట్ సినిమా లైన్ లో పెట్టాడు. ఆ సినిమా మీద కూడా కల్కి ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి టైం లోనే ప్రభాస్ చాలా జాగ్రత్తగా ప్రాజెక్టులు చేయాల్సి ఉంటుంది. సినిమాలకు ఎంత హైప్ ఉంటుందో అదే రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఉంటాయి. వాటిని రీచ్ అవ్వాల్సిన కంటెంట్ ఉండాల్సిందే లేదంటే మాత్రం సీన్ వేరేలా మారుతుంది.

Tags:    

Similar News

eac