కల్కి అప్డేట్ పై సైలెన్స్ ఎందుకు..?

ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి మూవీపై భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ అనగానే అంచనాలు భారీగా పెరిగాయి.

Update: 2023-12-25 15:30 GMT

థియేటర్ లో ప్రభాస్ సలార్ సందడి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ఊహించినట్టుగానే మంచి స్టఫ్ తో వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మాస్ ఫీస్ట్ తో సలార్ దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ కల్కి సినిమాతో వస్తున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు.

ఒక సినిమా సెట్స్ మీద ఉంది. అది కూడా స్టార్ హీరో సినిమా అయ్యుంటే దాని అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎదురుచూస్తుంటారు. ప్రభాస్ కల్కి విషయంలో అదే జరుగుతుంది. అప్పుడెప్పుడే కల్కి నుంచి ఒక టీజర్ వచ్చింది. ఆ తర్వాత మేకర్స్ కల్కి నుంచి ఎలాంటి ప్రచార చిత్రాలను వదల్లేదు. సినిమా 2024 మే 9న రిలీజ్ లాక్ చేశారు. రిలీజ్ కి 6 నెలలే ఉన్నా సినిమా గ్రాఫిక్స్ వర్క్ ఇంకా జరుగుతుందని తెలుస్తుంది.

ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి మూవీపై భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. ప్రభాస్ తో 500 కోట్ల బడ్జెట్ తో వస్తున్న కల్కి మీద మరి కాస్త హైప్ ఏర్పడింది. అయితే ఈ సినిమా అప్డేట్స్ విషయంలో మేకర్స్ ప్లాన్ ఏంటన్నది అర్థం కావట్లేదు.

సలార్ 1 ఫ్యాన్స్ ని మెప్పించినా కామన్ ఆడియన్స్ కాస్త నిరుత్సాహ పడ్డారని టాక్. కల్కి సినిమా కొత్త కథతో వస్తున్నాడు ప్రభాస్. తప్పకుండా రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగతా సినీ ప్రేక్షకులు కూడా ఆ సినిమాపై ఎంతో ఆస్క్తిగా ఉన్నారని చెప్పొచ్చు. ఈ సినిమా విషయంలో నాగ్ అశ్విన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. కల్కి 2898 AD తప్పకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రభాస్ సలార్ 1 రీసెంట్ గా రిలీజ్ కాగా కల్కి ని మేలో ప్లాన్ చేస్తున్నారు. మారుతితో చేస్తున్న సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. సో నెక్స్ట్ ఇయర్ రెబల్ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. సలార్ 2 కోసం ప్రభాస్ ప్రశాంత్ నీల్ మరో రెండేళ్లు వర్క్ చేయాల్సి ఉంది. సో సలార్ 2 మాత్రం లేట్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు.

Tags:    

Similar News