#క‌ల్కి లీక్స్.. గ్యాంగ్‌లీడ‌ర్ క‌నెక్ష‌న్‌తో మెగాఫ్యాన్స్ పూన‌కాలు!

నిజానికి ఇది #చిరులీక్స్ నుండి ప్రేరణ అని వ్యాఖ్యానించారు. డార్లింగ్ ప్ర‌భాస్ గ్యాస్ క‌ట‌ర్ తో ఏదో ప్లాన్ చేస్తున్నారు.

Update: 2023-08-22 15:49 GMT

మెగాస్టార్ చిరంజీవితో వైజ‌యంతి మూవీస్ అనుబంధం గురించి తెలిసిందే. చిరుతో అశ్వ‌నిద‌త్ మెగా బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను తెరకెక్కించారు. 'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి' లాంటి క్లాసిక్ హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాత‌గా దత్ కి ప‌రిశ్ర‌మ‌లో ఎన‌లేని గౌర‌వం ఉంది. ఇక చిరు బ‌ర్త్ డే అంటే మామూలుగా ఉంటుందా? 'ప్రాజెక్ట్ కే' రేంజులో విషెస్ కూడా అదిరిపోయాయ్.

మెగాస్టార్ చిరు పుట్టినరోజు సందర్భంగా వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'కల్కి2898 AD'కి సంబంధించిన అప్ డేట్ ని మేకర్స్ రివీల్ చేస్తూ.. గ్యాంగ్ లీడ‌ర్ థీమ్ మ్యూజిక్ ని సెట్ చేసిన తీరు హీటెక్కిస్తోంది. కల్కి ఎడిటింగ్ టేబుల్ నుండి అందిన‌ లీక్ ఇది. నిజానికి ఇది #చిరులీక్స్ నుండి ప్రేరణ అని వ్యాఖ్యానించారు. డార్లింగ్ ప్ర‌భాస్ గ్యాస్ క‌ట‌ర్ తో ఏదో ప్లాన్ చేస్తున్నారు. ల్యాబ్‌లో పోర్టబుల్ గ్యాస్ కట్టర్‌తో ప్రభాస్ క‌టౌట్ ని ఈ వీడియోలో ఆవిష్క‌రించారు.

ఈ సన్నివేశానికి గ్యాంగ్ లీడర్ థీమ్ మ్యూజిక్ ని జోడించ‌డంతో అది కాస్తా మెగాభిమానుల్లో అగ్గి రాజేసింది. గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలోని చిరు ఐకానిక్ గ్యాస్ లైటర్ సన్నివేశాన్ని ఇది త‌ల‌పించ‌డంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఈ వీడియోని జోరుగా వైర‌ల్ చేస్తున్నారు.

వైజయంతీ దీనికి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యను జోడించి మెగాస్టార్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ''స్ట్రెయిట్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ ది ఎడిటింగ్ రూమ్ ఆఫ్ #కల్కి2898AD .. మా మెగాస్టార్ కి అసాధారణమైన పుట్టినరోజు శుభాకాంక్షలు! #చిరులీక్స్ స్ఫూర్తితో..'' అని వ్యాఖ్య‌ను జోడించారు.

క‌ల్కి 2898 AD సైన్స్ పిక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం. దాదాపు 500కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. జ‌న‌వ‌రి 12న‌ సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంద‌ని ఇంత‌కుముందు చిత్ర‌బృందం ప్ర‌క‌టించినా కానీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పెండింగ్‌లో ఉన్నందున మే 9న విడుదలవుతుంద‌న్న పుకారు ఉంది. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ లో విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ విల‌న్ గా క‌నిపించ‌నున్నారు. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ఇత‌ర‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News