భారతీయుడు 2 .. మేకర్స్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కమల్?
కానీ మేకర్స్ నమ్ముతున్న దానికి విరుద్ధంగా ఈ సినిమాకు రెండు భాగాలు అవసరమని కమల్ హాసన్ భావించడం లేదు.
కమల్ హాసన్ సమీప భవిష్యత్తులో నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా చాలా ఎగ్జయిట్ చేసే ప్రాజెక్ట్‌లలో భాగం కాబోతున్నాడు. నటుడిగా నిర్మాతగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే కమల్ మరో అదనపు పాత్రను కూడా పోషిస్తున్నారు. ఇండియన్ 2 బెటర్ మెంట్ కోసం ఎడిటర్ పాత్రను కమల్ తీసుకున్నట్లు సమాచారం. భారతదేశపు లెజెండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 (ఇండియన్ 2) ఫైనల్ వెర్షన్ లో భారీ మార్పుల కోసం కమల్ హాసన్ సహకరిస్తున్నారనేది తాజా రిపోర్ట్.
తాజా కథనాల ప్రకారం 'ఇండియన్ 2' నిడివి ఇప్పుడు దాదాపు ఐదు గంటలు. అందుకే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా మార్చాలని నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. కానీ మేకర్స్ నమ్ముతున్న దానికి విరుద్ధంగా ఈ సినిమాకు రెండు భాగాలు అవసరమని కమల్ హాసన్ భావించడం లేదు. అందువల్ల కమల్ ఇండియన్ 2 కోసం ఎడిటర్ గా బాధ్యతలు తీసుకున్నారని.. సినిమా నిడివిని తగ్గించడంలో సహాయపడుతున్నారని పుకార్లు వస్తున్నాయి. భారతీయుడు 2 విడుదలకు సంబంధించి మేకర్స్ చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అయితే భారతీయుడు 2కి దక్కే ఆదరణను బట్టి పార్ట్ 3 తీయాలా వద్దా? అనేది ఆధారపడి ఉంటుంది.
భారతీయుడు 2 గురించి ప్రస్థావిస్తూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ చిత్రం మాట్లాడుతుందని కమల్ హాసన్ గతంలో వెల్లడించారు. తన రాజకీయ జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ 2కి సంతకం చేసానని కూడా కమల్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కానీ లోకేష్ కనగరాజ్ విక్రమ్ విడుదలై ఘనవిజయం సాధించాక కమల్ రేంజ్ అమాంతం పెరిగింది. కల్కి 2898 AD సహా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు అతడు సంతకాలు చేస్తున్నాడు.
ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కాళిదాస్ జయరామ్, గుల్షన్ గ్రోవర్, నేదుమూడి వేణు, వివేక్, సముద్రఖని, బాబీ సింహా, గురు సోమసుందరం, ఢిల్లీ గణేష్, జయప్రకాష్, మనోబాల, వెన్నెల కిషోర్, దీపా శంకర్ వంటి అద్భుతమైన తారాగణం నటిస్తోంది.