కెలికి తన్నించుకోవడం అంటే ఇదే!
ఇక్కడితో కంగన ఆగలేదు. ఇంటికొచ్చి ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టింది.` నేరం చేసే ప్రతీవాడికి ఓ కారణం ఉంటుంది.
బాలీవుడ్ నటి కంగన ఎంపీ అయిన తర్వాత కానిస్టేబుల్ చేతిలో తిన్న చెంప దెబ్బ దేశ వ్యాప్తంగా ఎంత సంచలన మైందో తెలిసిందే. రైతు ఉద్యమాన్ని..రైతుల్ని పలచన చేసినందుకు కారణంగా ఆ చెంప దెబ్బ కొట్టానని సదరు కానిస్టేబుల్ వివరణ ఇచ్చింది. ఈ విషయంలో కానిస్టేబుల్ కే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది. మంచి పని చేసావని కానిస్టేబుల్ ని ఆకాశానికి ఎత్తేసారు. కంగన తీరుని తప్పుబట్టారు.
ఇక్కడితో కంగన ఆగలేదు. ఇంటికొచ్చి ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టింది.` నేరం చేసే ప్రతీవాడికి ఓ కారణం ఉంటుంది. అలాగని నేరస్తుల భావోద్వేగాలకు విలువనిస్తే అనుమతి లేకుండా ఓ వ్యక్తిపై దాడి చేయడం వంటి సంఘటన అత్యాచారంతో సమానం. హత్యలు జరిగినా మీకేం పర్వాలేదనే అర్దం వస్తుంది. మీలాంటి వారు మానసిక స్థితిపై దృష్టి సారించండి అని ట్వీట్ చేసింది. ఈ క్రమంలో నెటి జనులంతా కంగన పాత పోస్టులు తవ్వి తీస్తున్నారు.
2022 ఆస్కార్ వేదికపై హాలీవుడ్ నటుడు క్రిస్ రాక్- విల్ స్మిత్ భార్యని ఎగతాళి చేయడంతో స్మిత్ , రాక్ని లాగి పెట్టి కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చర్యని కంగన సమర్దించింది. తన ఇన్ స్టాలో ఎవరైనా తెలివి తక్కువ మనుషులు తల్లి..సోదరి అనారోగ్యంపై ఇలాంటి జోకులేస్తే నేను కూడా విల్ స్మిత్ లాగి చెంపదెబ్బ కొడతానని మెచ్చుకుంది. ఇప్పుడీ పోస్ట్ మళ్లీ వైరల్ అవుతుంది. ఆ కానిస్టేబుల్ కూడా నువ్వు చెప్పినట్లే చేసింది కదా.
తల్లిని చులకన చేస్తే లాగిపెట్టి కొడతానన్నావ్..మరి రైతన్న దేశంలో పుట్టి ఆ రైతుల్నే చులకన చేసిన నిన్ను ఇంకెంత గట్టిగా కొట్టాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీన్నే ఖర్మ అంటూరు` అంటూ కంగన్ పై ఎటాకింగ్ మొదలైంది. రైతుల విషయంలో కంగన స్పందించిన తీరుపై అప్పుడే తీవ్రంగా విమర్శలు ఎదుర్కుంది. అయినా ఇంకా సమర్దించుకునే ప్రయత్నం చేయడంపై మరింత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీన్నే కెలికి మరీ తన్నించు కోవడం అంటారు.