జర జాగ్రత్తగా చూసుకో కన్నప్పా..?
ఇంతకీ ఈ లీడ్ అంతా దేనికి అంటే రీసెంట్ గా రిలీజైన కల్కి సినిమా ప్రభాస్ ఒక్కడే కాదు అమితాబ్, కమల్, దీపికా ఇలా అందరు తమ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయబట్టే ఈ రిజల్ట్ వచ్చింది.
భారీ సినిమా అంటే ఆ సినిమాకు పెద్ద ఎత్తున స్టార్ కాస్ట్.. వందల కోట్ల బడ్జెట్.. భారీ సెట్లు.. అద్భుతమైన గ్రాఫిక్స్.. అదిరిపోయే కాంబినేషన్స్ కాదు.. అసలు భారీ సినిమా అంటే ఆ కాంబినేషన్స్ అన్నిటినీ సెట్ చేసే కథ. ఆ కథ అద్భుతంగా కుదిరితే మిగతావన్నీ దానికి యాడెడ్ అడ్వాంటేజ్ గా మారతాయి. అలా కాకుండా ఏదో రెగ్యులర్ రొటీన్ స్టఫ్ కి ఎంత స్టార్ కలర్ అద్దుదామని చూసినా సరే చేతులకి మరక.. జేబులకి చిల్లులు తప్ప లాభం ఏమి ఉండదు.
ఇంతకీ ఈ లీడ్ అంతా దేనికి అంటే రీసెంట్ గా రిలీజైన కల్కి సినిమా ప్రభాస్ ఒక్కడే కాదు అమితాబ్, కమల్, దీపికా ఇలా అందరు తమ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయబట్టే ఈ రిజల్ట్ వచ్చింది. అంతేకాదు నాగ్ అశ్విన్ క్రియేటివిటీ తెర మీద ప్రత్యేకంగా కనిపించింది. తాను ఏం తీయాలని అనుకున్నాడో దాన్ని అన్ని విధాలుగా ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఐతే ఈ సినిమా చూశాక రాబోతున్న పాన్ ఇండియా సినిమాల మీద ఈ ఎఫెక్ట్ ఉండేలా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
భారీ స్కేల్ లో గ్రాండియర్ గా తీస్తే ఇలాంటి సినిమానే తీయాలి లేకపోతే అసలు ఇలాంటి కథలు టచ్ చేయొద్దు అనుకునేలా నాగ్ అశ్విన్ ప్రూవ్ చేశాడు. ఐతే కల్కి చూసిన తర్వాత త్వరలో రాబోతున్న కన్నప్ప సినిమా గురించి స్పెషల్ గా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మంచు విష్ణు సిన్సియర్ అండ్ సీరియస్ ఎఫర్ట్ గా కన్నప్ప తెరకెక్కిస్తున్నారు. సినిమాలో మంచు విష్ణుతో పాటుగా ప్రభాస్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ ఇలా భారీ తారాగణం మొత్తం ఉంది.
సినిమాలో వీళ్లంతా ఉన్నా సినిమా టీజర్ తో విమర్శలు అందుకున్నాడు మంచు విష్ణు. కల్కి చూసిన తర్వాత అయినా సరే కన్నప్పలో ఏదైనా మార్పులు చేస్తే బెటర్ అని అనుకుంటున్నారు ఆడియన్స్. అంతేకాదు కల్కి లాంటి విజువల్ వండర్ సినిమా చూశాక దానికి తగిన విజువల్స్ లేదా దాన్ని మించే సినిమా ఐతే ఓకే కానీ అంచనాలను ఏమాత్రం అందుకోకపోయినా సరే నెటిజన్ల ట్రోల్స్ కి సిద్ధం కాక తప్పదు. మరి మంచు విష్ణు కన్నప్పని ఏం చేస్తున్నాడన్నది చూడాలి. సినిమా ఎలాగు పూర్తి కాలేదు కాబట్టి ఇప్పటినుంచి జాగ్రత్త పడితే బెటర్ అనుకుంటున్నారు.