ముద్దు సీన్ మూడు రోజులు చిత్రీకరించారు
కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లలో నటించేసిన తర్వాత కూడా ఆ ముద్దు సీన్ గురించే ఇంకా మాట్లాడుకున్నారు అంతాగా ప్రభావితం చేసిన ఆ కిస్సింగ్ సీన్ ఇన్నేళ్ల తర్వాత కూడా చర్చగా మారుతోంది.
అది యువ హీరోయిన్ కి ఛాలెంజింగ్ రోల్. పైగా అగ్ర హీరో సరసన అరుదైన అవకాశం. హీరోతో ముద్దు సీన్ లోను నటించాల్సి ఉంది. చివరికి ఇద్దరు హీరోయిన్లు వదులుకున్న ఆ ఆఫర్ ని అంగీకరించింది. హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సీన్ కోసం ఏకంగా మూడు రోజులు పట్టిందట. ఓవైపు సెట్లో హీరోయిన్ తల్లిగారు వెంబడిస్తోంది. మూడు రోజులు ఆ సీన్ చిత్రీకరణ పూర్తయ్యేవరకూ హీరోయిన్ వెంటే మమ్మీ కూడా ఉన్నారు. మొత్తానికి ఏదోలా షూటింగ్ పూర్తి చేసారు. ముద్దు సీన్ చిత్రీకరణ పూర్తయింది. ఆ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ హీరోయిన్ కి బిగ్ బ్రేక్ నిచ్చింది. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లలో నటించేసిన తర్వాత కూడా ఆ ముద్దు సీన్ గురించే ఇంకా మాట్లాడుకున్నారు. అంతాగా ప్రభావితం చేసిన ఆ కిస్సింగ్ సీన్ ఇన్నేళ్ల తర్వాత కూడా చర్చగా మారుతోంది.
1996లో అమీర్ ఖాన్- కరిష్మా కపూర్ మూవీ `రాజా హిందుస్తానీ`లో ముద్దు సీన్ గురించే ఇదంతా. ఆ సినిమాతో ఈ జంట అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే గాక, బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 76 కోట్లు వసూలు చేసింది. కరిష్మా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఉత్తమ డెబ్యూ నటిగా ఫిలింఫేర్ ని గెలుచుకుంది. తాజా ఇంటర్వ్యూలో కరిష్మా స్వయంగా ఆ ముద్దు సన్నివేశం కోసం మూడు రోజులు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో రాజా హిందూస్తానీ మేకర్ ధర్మేష్ దర్శన్ మాట్లాడుతూ...సెట్ లో కరిష్మా చాలా ఉత్సాహంగా ఉందని, మొదటి ముద్దు సన్నివేశమే అయినా నిబద్ధతతో చేసిందని తెలిపారు. ఆ సన్నివేశం గురించి వివరిస్తుంటే అంతగా చెప్పాలా? అని ప్రశ్నించిందని కూడా ధర్మేష్ తెలిపారు. కరిష్మా ఇంకా చాలా చిన్నది.. అందువల్ల ఆమె తల్లిగారు బబితాజీని పిలిచి వివరించానని తెలిపారు. అంతేకాదు.. అమీర్- కరిష్మా ముద్దు సన్నివేశాన్ని యూత్ లో ఫీవర్ రాజేసేందుకు చర్చల్లోకి తెచ్చేందుకు పోస్టర్ పై ముద్రించాలని భావించారట. కానీ దానికి ససేమిరా అన్నారట.
నిజానికి రాజా హిందూస్తానీ సినిమా కోసం మొదటి ఎంపిక కరిష్మా కానేకాదు. తొలుత ఈ ఆఫర్ ఐశ్వర్యారాయ్ ని వరించింది. కానీ ఐశ్వర్యారాయ్ అప్పటికే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు ప్రిపరేషన్ లో ఉన్నారు. దాంతో ఆ అవకాశం జూహీ చావ్లాకు వెళ్లింది. కానీ పాత్ర డిమాండ్ల కారణంగా జూహీ దానిని తిరస్కరించింది. చివరికి కరిష్మా కపూర్ ని ఆ అవకాశం వరించింది. ఈ చిత్రం కరిష్మా కెరీర్ డెఫినిషన్ నే మార్చేసింది. రాజా హిందుస్తానీకి ముందు, కరిష్మా సాజన్ చలే ససురాల్, కూలీ నంబర్ 1, దులారా, రాజా బాబు వంటి సినిమాల్లో గోవిందాతో కలిసి కనిపించింది.