రాధ కుమార్తె కార్తీక పెళ్లి.. దర్శకేంద్రుడికి ఆహ్వానం?
90లలో గ్లామరస్ కథానాయికగా ఏలిన రాధ టాలీవుడ్ కోలీవుడ్ లో అగ్రహీరోల సరసన నటించిన సంగతి తెలిసిందే
90లలో గ్లామరస్ కథానాయికగా ఏలిన రాధ టాలీవుడ్ కోలీవుడ్ లో అగ్రహీరోల సరసన నటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్లకు హిట్ పెయిర్ గా పాపులరయ్యారు. ఆ తర్వాత రాధ ప్రముఖ బిజినెస్ మేన్ ని పెళ్లాడి దుబాయ్ లో సెటిలైన సంగతి తెలిసిందే. రాధకుమార్తెలు కార్తీక నాయిర్, తులసి నాయిర్ కూడా కథానాయికలు అయ్యారు. కానీ ఇద్దరి కెరీర్ ఆశించిన స్థాయికి ఎదగలేదు.
అనంతరం తమ వ్యాపారాల్లో కార్తీక నాయిర్ కూడా బిజీ అయ్యారు. ఇటీవలే కార్తీక నాయర్ నిశ్చితార్థం ఎటువంటి హంగామా లేకుండా జరిగింది. కార్తీక స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దాని గురించి హింట్ ఇచ్చారు. కాబోయేవాడితో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసారు. అయితే ఈ ఫోటోలో తన హబ్బీ ఎవరు? అన్నది అంత స్పష్ఠంగా లేదు. కార్తీక కాబోయే వ్యక్తిని ఆలింగనం చేసుకుని ఆనందంగా కనిపిచింది. ఈ ఫోటోలో నిశ్చితార్థపు ఉంగరం కనిపించింది. అయితే కార్తీక ప్రియుడి గురించి ఎటువంటి సమాచారం ఇప్పటివరకూ అందుబాటులో లేదు.
కార్తీక పెళ్లి తేదీ లాక్ అయిందని సమాచారం. ప్రస్తుతం పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి పలువురు టాలీవుడ్ ప్రముఖులకు శుభలేఖలు అందనున్నాయని కూడా టాక్ వినిపిస్తోంది. తాజాగా దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావును రాధ కలిసారు. దీంతో కుమార్తె పెళ్లికి ఆహ్వానించేందుకు రాధ హైదరాబాద్ కి వచ్చారని అర్థమవుతోంది. అందుకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే కార్తీక పెళ్లి ఎప్పుడు? ఎవరెవరికి ఆహ్వానాలు అందాయి? అన్నదానిపై ఎలాంటి సమాచారం లేదు. కుమార్తె పెళ్లి గురించి రాధ స్వయంగా వెల్లడిస్తారేమో చూడాలి.
కార్తీక కెరీర్ జర్నీ ఇలా..
రాధ కుమార్తె కార్తీక నాయర్ 2009లో తెలుగు చిత్రం 'జోష్'తో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ఇదే చిత్రంతో నాగ చైతన్య కథానాయకుడిగా పరిచయమయ్యారు. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత తమిళ హీరో జీవా - పియా బాజ్‌పాయ్‌లతో కలిసి రెండవ చిత్రం 'రంగం'తో పెద్ద విజయం అందుకుంది. ఈ చిత్రం తమిళంలో 'కో' పేరుతో విడుదలై పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత మలయాళ చిత్రం 'ప్రొప్రైటర్స్: కమ్మత్ & కమ్మత్'లోను నటించింది. ఆ చిత్రంలో దిలీప్ సరసన కార్తీక నటించింది. కామెడీ చిత్రం బ్రదర్ ఆఫ్ బొమ్మాళి- సామాజిక నేపథ్య డ్రామా పురంపోక్కు ఎంగిర పొదువుదమై అనే చిత్రాల్లో నటించింది. ఎపిక్ హిందీ టీవీ సిరీస్ 'ఆరంభ్'లో యాక్షన్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో కార్తీక ఆకట్టుకుంది.