హీరో రిక్వెస్ట్ ఫ్యాన్స్ పట్టించుకుంటారా?
ఓవైపు సినిమా చూస్తూనే సంబంధించి సంస్థలకు సమాచారం లైవ్ లోనే వెళ్లిపోతుంది. అంతే వేగంగా ఆవిషయం పబ్లిష్ అవుతుంది.
సినిమా రిలీజ్ అయ్యే వరకూ దర్శక-నిర్మాతల టెన్షన్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఆన్ సెట్స్ లీకులు.. కీలకమైన సన్నివేశాలు బయటకొస్తే? కోట్ల రూపాయల కష్టమంటూ బూడిదలో పోసిన పన్నీరుగా భావిస్తారు. అందుకే రిలీజ్ కి ముందు ఎట్టి పరస్థితుల్లో చిన్న లీక్ కూడా కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటారు. కేవలం మెయిన్ క్రూ తప్ప! మిగతా ఎవ్వరూ స్మార్ట్ ఫోన్లు తీసుకెళ్లడానికి వీలు లేకుండా ఆంక్షలుంటాయి. ఇదంతా రిలీజ్ కి ముందు జరిగే తంతు. ఇక రిలీజ్ డే రోజున లైవ్ లోనే రివ్యూలు నెట్టింట వైరల్ అవుతుంటాయి.
ఓవైపు సినిమా చూస్తూనే సంబంధించి సంస్థలకు సమాచారం లైవ్ లోనే వెళ్లిపోతుంది. అంతే వేగంగా ఆవిషయం పబ్లిష్ అవుతుంది. ఇక ఆ తర్వాత పైరసీలు...సినిమాలో కీలకమైన సన్నివేశాలు యూ ట్యూబ్ లో చక్కెర్లు కొట్టడం మామూలే. వీటినెవరు పెద్ద సీరియస్ గానూ తీసుకోరు. ఈ నేపథ్యంలో తాజాగా హీరో కార్తీ ఓ వింత విన్నపం చేసాడు. ఆయన కథానాయకుడిగా నటించిన `జపాన్ `సినిమా నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయోద్దని రిక్వెస్ట్ చేసాడు. చెన్నైలోని ఓ థియేటర్లో అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఈ విజ్ఞప్తి చేసాడు. సినిమా పట్ల సంతృప్తిగా ఉన్నా.. అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అని అన్నారు. కానీ కార్తీ విజ్ఞప్తి సాధ్యమయ్యేదేనా? అన్నది ఆలోచించాల్సిన విషయం. సినిమాకి సంబంధించి చిన్న విషయం దొరికినా నెట్టింట క్షణాల్లో చక్కెర్లు కొడుతుంది.
అలాంటిది రిలీజ్ తర్వాత సినిమా గురించి సోషల్ మీడియాలో చెప్పొద్దు అంటే ఊరుకునేది ఎవరు? ఉత్సాహమో..అత్యుత్సాహమో! విషయాన్ని వెంటనే పోస్ట్ చేయాలి అని అభిమానులు భావిస్తుంటారు. మరి కార్తి విజ్ఞప్తిని అభిమానులు సీరియస్ గా తీసుకుని ఆ విధంగా చర్యలు తీసుకుంటారా? వాళ్లే తొందరపడతారా? అన్నది చూడాలి. జపాన్ చిత్రాన్ని రాజ్ మురగన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.