కత్తి లాంటి సొగసుతో గుచ్చేసిన కత్రిన
ఈ సందర్భంగా కత్రిన తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి దీపాల కాంతిలో జాబిలమ్మను తలపించింది.
బాలీవుడ్ సెలబ్రిటీలు దీపావళి వేడుకల నుంచి ఫోటోలు వీడియోలను షేర్ చేస్తుంటే అవి అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ముంబై లాంటి మెట్రోల్లో దీపావళిని మూడు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా సెలబ్రిటీలు వరుసగా దీపావళి రాత్రులను కాంతులతో నింపేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ కపుల్స్ దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ దీపావళి పోస్ట్ వైరల్ అయింది. ఈ సందర్భంగా కత్రిన తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి దీపాల కాంతిలో జాబిలమ్మను తలపించింది.
నవంబర్ 1న కత్రినా ఇంట దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కత్రినా ఎంతో ట్రెడిషనల్ గా కనిపించింది. పాస్టెల్ వర్ణపు జాతి దుస్తులలో కత్రిన కైఫ్ అద్భుతంగా కనిపించింది. పీచ్ షీర్ చీరతో పాస్టెల్ గ్రీన్ కార్సెట్ ఫ్లోరల్ బ్లౌజ్‌ని ధరించిన ఈ బ్యూటీ యూనిక్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు విక్కీ కౌశల్ మెరిసే బ్లాక్ షేర్వాణీ సూట్ సెట్లో స్మార్ట్ గా కనిపించాడు. అందమైన జంట సాంప్రదాయబద్ధంగా కనిపించింది. విక్కీ పండుగలో సాధారణ మొండి రూపానికి భిన్నంగా సన్నని మీసాలు, కత్తిరించిన కేశాలంకరణతో ఇస్మార్ట్ గా కనిపించాడు. ప్రస్తుతం భన్సాలీ దర్శకత్వం లో `లవ్ అండ్ వార్` లుక్ ఇదేనని అర్థమైంది. విక్కీ. రణబీర్ - ఆలియా ఇందులో కీలక పాత్రధారులు.
కత్రిన- విక్కీ జంట ఫ్యామిలీ సెలబ్రేషన్స్ పై అభిమానులు రకరకాల వ్యాఖ్యలు చేసారు. ``అత్యంత అందమైన జంట! దీపావళి శుభాకాంక్షలు, మీరు అందమైన వ్యక్తులు!`` అని ఒకరు వ్యాఖ్యానించగా, మరొకరు స్పందిస్తూ, ``దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు`` అని మరికొందరు రాసారు. శ్రద్ధా కపూర్ సహా పలువురు టాప్ సెలబ్రిటీలు వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.