గాండీవదారి నిర్మాతకు అక్కడ మంచి హిట్టే పడింది

టాలీవుడ్ లో బడా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని బివిఎస్ఎన్ ప్రసాద్ సొంతం చేసుకున్నారు

Update: 2024-05-11 11:07 GMT

టాలీవుడ్ లో బడా నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని బివిఎస్ఎన్ ప్రసాద్ సొంతం చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. గత ఏడాది విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే గాండీవదారి అర్జున మూవీ డిజాస్టర్ అయ్యింది. అశ్విన్స్ సినిమాతో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా కోలీవుడ్ లోకి అడుగుపెట్టారు.

ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. తాజాగా స్టార్ అనే సినిమాని రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీనిధి సాగర్ ఈ చిత్రానికి మరో నిర్మాతగా ఉన్నారు. ఇదిలా ఉంటే మే 10న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఎలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కెవిన్ లీడ్ రోల్ లో నటించారు. తాజాగా రిలీజ్ అయిన స్టార్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

పబ్లిక్ కి యునానమస్ గా సినిమాకి హిట్ టాక్ ఇచ్చేశారు. రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడం విశేషం. చిన్న సినిమాగా వచ్చిన తమిళ్ ఆడియన్స్ కి స్టార్ మూవీ విపరీతంగా కనెక్ట్ అయ్యింది. చిన్నప్పటి నుంచి నటుడు అవ్వాలనే డ్రీం ఉన్న యువకుడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి చేసిన ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో కావాల్సినంత వినోదం ఉండటంతో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది.

యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. 12 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ బట్టి లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో కూడా డబ్ చేసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఎలన్ దర్శకుడిగా నందిని రాయ్ లీడ్ రోల్ లో గర్భాదానం అనే సినిమాతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టాడు.

తరువాత హరీష్ కళ్యాణ్ తో ప్యార్ ప్రేమ కాదల్ అనే సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. మూడో చిత్రంగా స్టార్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. స్టార్ మూవీకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి. తెలుగులో అతనే రిలీజ్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News