కేసీఆర్ టైటిల్.. జబర్దస్త్ కమెడియన్ సర్ ప్రైజ్!
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. తెలంగాణ మంత్రి సి. మల్లా రెడ్డి దీన్ని రిలీజ్ చేశారు.
జబర్దస్త్ షోతో పాపులర్ అయిన హాస్యనటుడు రాకింగ్ రాకేశ్. తనని తాను ప్రూవ్ చేసుకుంటూ బుల్లితెర ప్రేక్షకుల్లో పాపులారిటీ సంపాదించుకున్న ఆయన కెరీర్లో మరో అడుగు వేసి హీరోగా మారబోతున్నారు. ఆయన కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని బంజారా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రూపుదిద్దుకుంటోంది. గరుడవేగ అంజి డీఓపీ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. తెలంగాణ మంత్రి సి. మల్లా రెడ్డి దీన్ని రిలీజ్ చేశారు. సినిమాకు కేసీఆర్(కేశవ చంద్ర రామ్వత్) అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. పోస్టర్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కటౌట్ ముందు ఓ బాలుడు నిల్చొని తదేకంగా చూస్తున్నట్లు చూపించారు.
అలానే పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో రైతులు, బంజారా మహిళలు, గొర్రెలు, పచ్చనీ పొలాలు.. ఇలా చాలా కనిపిస్తున్నాయి. మొత్తంగా గ్రామీణ వాతావరణం, తెలంగాణ సంస్కృతి పోస్టర్లో ఉట్టిపడుతోంది.
సీఎం కేసీఆర్ అడ్వైసర్ దేశపాటి శ్రీనివాస్, పెద్దింటి అశోక్.. సినిమాకు కొన్ని కీలక సన్నివేశాలను అందించారు. నవీన్ కోలా - రాకింగ్ రాకేశ్ సినిమాకు స్క్రిప్ట్ రైటర్స్‌గా కూడా వ్యవహరించారు. కుశుమ రాజ్‌కుమార్ - ఉండ్రవెల్లి నాగరాజ్ డైలాగ్స్ అందించారు. పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణ కూతురు అనన్య మేనన్ హీరోయిన్గా ఈ చిత్రంతో అరంగేట్రం చేస్తోంది. ఇంకా సినిమాలో తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్, జోర్దార్ సుజాత, ధనరాజ్, తాగుబోతు రమేశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ - విభూది ఎంటర్టైన్మెంట్స్ - గరుడవేగ మేకింగ్స్.. కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. రాకింగ్ రాకేశ్ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. సినిమాకు తెలంగాణ మ్యాస్ట్రో చరణ్ అర్జున్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బలగం మధు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కాశర్ల శ్యామ్, గోరేటి వెంకన్న, చరణ్ అర్జున్ పాటలకు లిరిక్స్ అందిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో....