కీర్తి సురేష్ సడన్ ట్విస్ట్.. మ్యాటరెంటి?

తరువాత కొంతకాలం ఫీమేల్ సెంట్రిక్ కథలతో కీర్తి సురేష్ సినిమాలు చేసిన సక్సెస్ కాలేదు.

Update: 2024-04-01 04:23 GMT

టాలీవుడ్ లో మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించి ఏకంగా నేషనల్ అవార్డుని అందుకున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత నానికి జోడీగా నేను లోకల్ మూవీతో వరుసగా రెండు సక్సెస్ లు అందుకుంది. మూడో సినిమానే ఏకంగా బయోపిక్ లో నటించి పెద్ద రిస్క్ చేసింది. అయితే ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా ఆమెని స్టార్ హీరోయిన్ గా మార్చేసింది.

తరువాత కొంతకాలం ఫీమేల్ సెంట్రిక్ కథలతో కీర్తి సురేష్ సినిమాలు చేసిన సక్సెస్ కాలేదు. మళ్ళీ కమర్షియల్ హీరోయిన్ గా మారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారువారిపాట, నానితో దసరా సినిమాలు చేసి కమర్షియల్ హిట్స్ అందుకుంది. చివరిగా కీర్తి సురేష్ మెగాస్టార్ భోళా శంకర్ సినిమాలో నటించింది. తరువాత ఇప్పటి వరకు తెలుగులో ఒక్క మూవీ కూడా ఒకే చేయలేదు.

అయితే కీర్తి తమిళ్, మలయాళం, హిందీ భాషలలో 4 సినిమాల వరకు కమిట్ అయ్యి ఉంది. వీటి మీద ఆమె ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా హిందీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలనే ప్రయత్నంలో కీర్తి సురేష్ ఉందంట. గతంలో అజయ్ దేవగన్ మైదాన్ సినిమాలో కీర్తిని హీరోయిన్ గా ఖరారు చేశారు. ఏజ్ పరంగా ఇద్దరికి సెట్ కావడం లేదని కీర్తి ప్లేస్ లో ప్రియమణిని తీసుకున్నారు.

హిందీలో తెరికి రీమేక్ గా బేబీ జాన్ మూవీ తెరకెక్కుతోంది. వరుణ్ ధావన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తోంది. బేబీ జాన్ హిట్ అయితే బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తోంది. ప్రస్తుతం చేస్తోన్న సినిమాల కోసం కీర్తి సురేష్ తన పెళ్లిని కూడా వాయిదా వేసుకుందంట.

ఇంట్లో తల్లిదండ్రులు బలవంతం చేస్తోన్న ప్రస్తుతం ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టిందని టాక్. హిందీ మీద ఎక్కువ ఫోకస్ చేయడంతో కీర్తి సురేష్ తెలుగు సినిమాలకి కొంతదూరంగా ఉందని తెలుస్తోంది. మళ్ళీ ఆమె తెలుగులో సినిమా చేస్తే చూడాలని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. స్ట్రైట్ తెలుగు సినిమాలలో కీర్తి సురేష్ కనిపించకపోయిన డబ్బింగ్ చిత్రాల ద్వారా ఆడియన్స్ ని తన పెర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. చివరిగా ఆమె జయం రవి సెరిన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది.

Tags:    

Similar News