ఖుఫియా ట్రైలర్: లీకులిచ్చే ఏజెంట్ పని పట్టే RAW ఆఫీసర్ స్టోరి
జాతీయ ఉత్తమ నటి టబు తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలతో సంచలనాలకు కేరాఫ్ గా మారారు. ఇప్పుడు ఖుఫియాలో మరోసారి తన విశ్వరూపం చూపించారు.
జాతీయ ఉత్తమ నటి టబు తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలతో సంచలనాలకు కేరాఫ్ గా మారారు. ఇప్పుడు ఖుఫియాలో మరోసారి తన విశ్వరూపం చూపించారు. విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ ఖుఫియా ట్రైలర్ సోమవారం విడుదలైంది. టబు, అలీ ఫజల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం వచ్చే నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. నిజ జీవిత కేసు ఆధారంగా రూపొందించిన ఈ ఇంటెన్స్ మూవీ ట్రైలర్, సినిమా టోన్ సహా నటీనటుల కెమిస్ట్రీని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ట్రైలర్ ఆద్యంతం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAWలోని లీక్ వ్యవహారం చుట్టూ తిరుగుతోంది. లీక్ చేసే ఏజెంట్ల భరతం పట్టే పై అధికారిగా టబు నటించింది. ఏజెంట్లలో ద్రోహి ఎవరు? అనేది టబు పరిశోధిస్తుంది. ప్రధాన నిందితుడిగా అలీ ఫజల్ నెగెటివ్ పాత్రలో కనిపిస్తున్నారు. ఏజెంట్లు అతనిపై గూఢచర్యం చేయడం ప్రారంభిస్తారు. భార్య (వామికా గబ్బి) సహా అతడి జీవితంలోని ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తారు. అయితే ప్రపంచం విశ్వసిస్తున్నట్లుగా అతడు నిజంగా 'దేశద్రోహినా?' లేక అంతకన్నా దుర్మార్గం ఇంకేదైనా దాగి ఉందా? అనేది ఆలోచింపజేస్తోంది. ట్రైలర్ ఆద్యంతం క్యూరియాసిటీ పెంచుతోంది. ట్రైలర్‌పై ఓ అభిమాని స్పందిస్తూ ఇది ఎంత అద్భుతం అంటూ ప్రశంసించారు. విశాల్ భరద్వాజ్ ఏది చేసినా అది ఎల్లప్పుడూ బాగుంటుంది. చాలామంది అభిమానులు విశాల్ తెరకెక్కించిన రెండు ప్రాజెక్ట్‌ల బ్యాక్-టు-బ్యాక్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఖుఫియాకు ఒక వారం ముందు, అతడు తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ 'చార్లీ చోప్రా' ఓటీటీ సోనీ లివ్‌లో విడుదలవుతోంది.
ఖుఫియా గురించి దర్శకుడు విశాల్ భరద్వాజ్ మాట్లాడుతూ -''నేను ఎప్పుడూ గూఢచర్య ప్రపంచంపై ఆకర్షితుడిని అయ్యాను. ఖుఫియాతో ఈ శైలిని అన్వేషించడానికి నిజంగా సంతోషిస్తున్నాను. ఈ చిత్రం నాకు టబుతో మళ్లీ కలిసి పని చేసే అవకాశం కల్పించింది. ఇద్దరు చాలా ప్రతిభావంతులైన నటులు అలీ ఫజల్ - వామికా గబ్బితో తొలిసారి కలిసి పని చేసాను. ఇది నెట్‌ఫ్లిక్స్‌తో నా భాగస్వామ్యాన్ని కూడా సూచిస్తుంది. ఈ థ్రిల్లింగ్ సినిమాని 190 దేశాలలోని వీక్షకులకు షేర్ చేయడానికి నేను వేచి ఉండలేను'' అని అన్నారు. హైదర్ - మక్బూల్ తర్వాత మేము మూడవసారి తిరిగి కలిసి పని చేస్తున్నాం. నా అభిమాన దర్శకుడు విశాల్ భరద్వాజ్‌తో మరోసారి కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. విశాల్ ప్రత్యేక దృష్టి ఎల్లప్పుడూ నాకు ఆసక్తిని కలిగిస్తుంది. ఖుఫియా కూడా దీనికి మినహాయింపు కాదు.. అని అన్నారు.
RAW కౌంటర్ గూఢచర్య యూనిట్ మాజీ చీఫ్ అమర్ భూషణ్ రాసిన 'ఎస్కేప్ టు నోవేర్' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చిత్రంలో ఆశిష్ విద్యార్థి - అజ్మేరీ హక్ బధోన్ కూడా నటించారు. ఇది అక్టోబర్ 5 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.