దిల్ రూబా: మరో ప్రయోగంతో కిరణ్ అబ్బవరం
ఇక ఇప్పుడు తన 10వ సినిమాగా "దిల్ రూబా"లో నటించేందుకు సిద్ధమయ్యారు. తన గ్లోబల్ హిట్ KA తర్వాత కిరణ్ చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి గట్టిగానే ఉంది.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో సరికొత్త స్టోరీ ఉంటుందని ఇదివరకే కొన్నిసార్లు రుజువు చేశాడు. ఇటీవల KA సినిమాతో బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తన 10వ సినిమాగా "దిల్ రూబా"లో నటించేందుకు సిద్ధమయ్యారు. తన గ్లోబల్ హిట్ KA తర్వాత కిరణ్ చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి గట్టిగానే ఉంది. ఈసారి కిరణ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు.
"దిల్ రూబా" టైటిల్ పోస్టర్‌ని విడుదల చేసిన తర్వాత సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఫిబ్రవరి 2025లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం కిరణ్ కెరీర్‌లో మరో స్థాయిలో నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. టైటిల్ పోస్టర్‌లో కిరణ్ అబ్బవరం స్టైలిష్ అవతార్‌లో కనిపించగా, “హిస్ లవ్, హిస్ ఆంగర్” అనే ట్యాగ్‌లైన్ ఆయన పాత్రను మరింత ఆసక్తిగా మార్చేసింది. చూస్తుంటే కోపంతో ఊగిపోయే ప్రేమికుడు అనిపిస్తోంది.
రిలీజ్ చేసిన లేటెస్ట్ పోస్టర్‌లో కిరణ్ సిగరెట్ తాగుతూ ఏదో ఆలోచనలో మునిగిపోతున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో కిరణ్ పాత్రను ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ స్టోరీ ముందుకు సాగుతుంది. "దిల్ రూబా"ను విశ్వ కరన్ డైరెక్ట్ చేస్తుండగా, సివం సెల్యులాయిడ్స్ మరియు సరేగమ ఇండియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ కోసం రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక KA ఫేమ్ సామ్ సి.ఎస్ సంగీతం అందించనున్నారు. రుక్సార్ ఢిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుండగా, ఆమె పాత్ర కూడా కథనంలో కీలక పాత్ర పోషించనుంది. కిరణ్ అబ్బవరం ఇప్పటికే తన పాత్ర కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్. సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశం కూడా కొత్తదనంతో ఉంటుందని డైరెక్టర్ విశ్వ కరన్ తెలియజేశారు.
ప్రేమ, ప్రతీకారం, అతి ఆవేశం వంటి ఎమోషన్ల మధ్య కథ సాగుతుందని నిర్మాతలు వెల్లడించారు. ఇప్పటికే టైటిల్ పోస్టర్‌తో పాటు లీకైన కొన్ని అప్డేట్లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ ఏడాది బాక్సాఫీస్‌పై 50 కోట్ల కలెక్షన్లు సాధించిన "KA" తర్వాత కిరణ్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి దీనిపై అంచనాలు గట్టిగానే ఉంటాయి. ఇక జెట్ స్పీడ్ లో రెండు విజయవంతమైన చిత్రాలతో కిరణ్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని మరింత బలపరుచుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.