డ్రగ్స్ కేసు పిటీషన్ లో క్రిష్ ఆసక్తిర విషయాలు!
ఈ నేపథ్యంలో క్రిష్ పిటీషన్ లో పేర్కొన్న విషయాలు బయటకు వచ్చాయి. 'డ్రగ్స్ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదని.. వివేకానంద్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే తనని నిందితుడిగా చేర్చారన్నారు.
రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎఫ్ ఐ ఆర్ లో క్రిష్ ని సైతం నిందుతిడుగా చేర్చారు. విచారణకు హాజరు కావాలని కోరగా తొలుత అందుకు ఒప్పుకున్న క్రిష్ అటుపై రెండు రోజులు సమయం కావాలని కోరారు. అయితే విచారణకంటే ముందుగానే హైకోర్టులో ముందొస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసారు. తాజాగా ఆ బెయిల్ పై విచారణ జరగగా తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో క్రిష్ పిటీషన్ లో పేర్కొన్న విషయాలు బయటకు వచ్చాయి. 'డ్రగ్స్ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదని.. వివేకానంద్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే తనని నిందితుడిగా చేర్చారన్నారు. డ్రగ్స్ తీసుకున్నాను అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని..కేవలం ఆ పార్టీ జరుగుతోన్న సమయంలో అక్కడ ఉండటమే తనకు సమస్యగా మారిందని... ఆ కారణంగానే కేసులో చేర్చినట్లు క్రిష్ పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్రిష్ విషయంలో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది? అన్నది ఆసక్తి నెలకొంది. కోర్టుకు తాను చెప్పాల్సిందంతా పిటీషన్ రూపంలో అందించి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
వివేక్ నంద్ వాంగ్మూలం ఆధారంగా క్రిష్ పేరు తెరపైకి రావడం..ఆయన ముందు విచారణకు వస్తాననడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు వివేక్ నంద-క్రిష్ మధ్య ఎలాంటి సంబంధాలున్నాయి? అన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే కోర్టు ఆర్డర్ ద్వారా క్రిష్ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుని పరీక్షలకు పంపిచాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.
మరి ఈ డ్రగ్స్ వివాదంలో క్రిష్ ఎలా బయట పడతాడు? అన్నది చూడాలి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలువురు నటులు..దర్శకులు..నిర్మాతలు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. క్రిష్ కంటే ముందు నటుడు నవదీప్ ఈ ఆరోపణలు ఎదుర్కున్నాడు. అంతకు ముందు మరికొంత మంది. వీళ్లందరిపై ఇంకా విచారణ కొనసాగుతుంది. కోర్టులో కేసు నడుస్తోంది. ఇంతలోనే క్రిష్ పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది.