రాజేంద్రప్రసాద్ తో వివాదంపై స్పందించిన డైరెక్ట‌ర్!

కానీ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కృష్ణా రెడ్డి ఆ వివాదం గురించి చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే...

Update: 2024-09-07 07:41 GMT

న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్- స్టార్ మేక‌ర్ ఎస్. వి. కృష్ణారెడ్డి కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.'మాయలోడు' , 'రాజేంద్రుడు గజేంద్రుడు' లాంటి సూప‌ర్ హిట్ చిత్రాలు క‌నిపిస్తాయి. ఆ త‌ర్వాత కృష్ణారెడ్డి ఎన్నో హిట్ సినిమాలు తెర‌కెక్కించారు. కానీ రాజేంద్ర‌ప్ర‌సాద్ కాంబినేష‌న్ లో మాత్రం మ‌ళ్లీ సినిమాలు రాలేదు.

అందుకు కార‌ణంగా ఇద్ద‌రి మ‌ధ్య త‌లెత్తిన వివాదం కార‌ణంగా క‌లిసి ప‌నిచేయలేదు అని చాలా కాలంగా ఉన్న‌దే. అయితే ఆ వివాదానికి కార‌ణం ఏంటి? అన్న‌తి ఇంత‌వ‌ర‌కూ క్లారిటా లేదు. కానీ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కృష్ణా రెడ్డి ఆ వివాదం గురించి చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే...

'ఆయన మంచివాడు కావొచ్చు. నేను మంచివాడిని కావొచ్చు. అయినా చిన్నచిన్నవేవో ఉంటూనే ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఎందుకూ? రాజేంద్రప్రసాద్ చాలా మంచివాడు. అందువల్లనే ఇటీవల నేను చేసిన 'ఆర్గానిక్ మావ' సినిమాలోను ఆయన చేశారు. మా మధ్య 'మాయలోడు' సినిమా సమయంలో సమస్య వచ్చింది. ఆ తరువాత నేను ఆయనతో సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్ తరువాత 'సరదా సరదాగా' లాంటి సినిమా ఏదో మొదలుపెట్టినప్పుడు చేయడానికి ఆయన సిద్ధపడ్డారు.

చాలా మంచివాడు. కాకపోతే కొంచెం ఈగోనో? ఇంకొకటో? ఉంటాయి. బ్రతిమలాడుకుని చేయించు కోవాలంతే. అంత‌కు మించి అత‌నితో పెద్ద‌గా వివాదాలు అంటూ ఏమీ లేవు. చిన్న చిన్న వాటిని ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు. అలాగే అలీతో 'యమలీల' అనుకున్నప్పుడు, తాము చేస్తామని కొంత మంది పెద్ద హీరోలు ముందుకు వచ్చారు. కానీ నేను అలీతోనే చేస్తానని చెప్పాను. అలీతో న‌టించ‌డానికి సౌందర్య వెనకాడితేనే ఇంద్రజను తీసుకున్నాను' అన్నారు.

Tags:    

Similar News